Tyson Naidu: బెల్లంకొండ సినిమా నుంచి క్రేజీ అప్డేట్

Tyson Naidu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కొంతమంది వారసత్వాన్ని అంది తెచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మరి కొంతమంది సొంత టాలెంట్ తో ఎదిగి ఆ తర్వాత సక్సెస్ అవుతున్నారు. అయితే వారసత్వాన్ని అందుపుచ్చుకొని వచ్చిన హీరోలలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ అల్లుడు శీను. 2014 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లుడు శీను సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ ముందుకు సాగిస్తున్నాడు ఈ అల్లుడు శీను.

Tyson Naidu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

- Advertisement -

అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మరో సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమా వస్తోంది. ఇది పూర్తిగా యాక్షన్ సినిమా. 14 రైల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోందట.

TysonNaidu మూవీ షూటింగ్‌ రాజస్థాన్‌లో రెండు వారాల పాటు జరుగనుందట. స్టన్‌ శివ మాస్టర్ పర్యవేక్షణలో ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్ బ్లాక్‌ను రాజస్థాన్‌ లో రూపొందిస్తున్నారట. ఈ సీన్‌ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తోందని చిత్ర బృందం పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు