Happy Birthday Karthi : తెలుగు ఆడియన్సే నాకు ఇష్టం

Happy Birthday Karthi : తమిళ్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీ చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. కార్తీ కు కూడా తెలుగులో సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు అనడం అతిశయోక్తి కాదు. సూర్య తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తనకంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. కార్తీ కు కూడా పర్సనల్ గా తెలుగు ఆడియన్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని చెబుతూ ఉంటాడు. కార్తీ ని చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు కార్తీ ఎప్పుడు పరభాష నటుడు అనిపించుకోడు ఎందుకంటే అంత చక్కగా తెలుగు మాట్లాడుతాడు.

లవ్ గురు దగ్గర శిష్యరికం

లవ్ గురు మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అద్భుతమైన లవ్ స్టోరీస్ అన్నీ కూడా మణిరత్నం అందించినవే అని చెప్పొచ్చు. అవి డబ్బింగ్ సినిమాలు అయినా కూడా తెలుగు ప్రేక్షకులు వాటిని ఆదరించి మణిరత్నం ను ఓన్ చేసుకున్నారు. అయితే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు కార్తీ. కార్తీతో పాటు లవర్ బాయ్ సిద్ధార్థ కూడా మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే మణిరత్నం దగ్గర పనిచేసిన ఈ ఇద్దరు హీరోలు కూడా మంచి హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో మంచి మార్కెట్ను సాధించుకున్నారు.

Karthi

- Advertisement -

కార్తీ ప్రతి సినిమా తెలుగులో

కార్తీ చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తుంది. వాటికి స్వయంగా కార్తి డబ్బింగ్ చెప్పుకోవడం వలన ఇంకొంచెం రీచ్ తెలుగు ఆడియన్స్ లో కార్తీకి ఉంది. కార్తి స్ట్రైట్ ఫిలిం తెలుగులో చేస్తే మార్కెట్ ఏంటో తెలుగు ప్రేక్షకులు ఈజీగా ప్రూవ్ చేస్తారు. కేవలం నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం చేస్తుంటారు కార్తీ. అందుకోసమే తెలుగు ఆడియోన్స్ పర్సనల్ లైఫ్ ని చూసి కూడా ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరోకి దాదాపు పది ఏళ్ళు పాటు హిట్ లేకపోయినా కూడా ఒక మంచి కం బ్యాక్ ఫిల్మ్ వస్తే ఆదరించారు. అంటే దానికి కారణం ఆ వ్యక్తిత్వం నచ్చడం.

తెలుగు ఆడియన్స్ అంటేనే ఇష్టం

ఇకపోతే ఒక సినిమా ఫంక్షన్ అవార్డ్స్ లో, తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఇష్టమా.? తమిళ్ ఆడియన్స్ ఎక్కువ ఇష్టమా.? అని అడిగినప్పుడు కార్తీ సమాధానంగా డెఫినిట్లీ తెలుగు ఆడియోన్స్ ఎందుకంటే నేను ఇక్కడ ఆవారా సినిమా చూశాను. యుగానికి ఒక్కడు సినిమా చూశాను. ప్రతి సీన్ కి, ప్రతి ఫ్రేమ్ కి చప్పట్లు కొట్టారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ నేను తమిళ్లో చేయలేదు నాకు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ. ఇలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు