Ameesha Patel: బికినీలో రెచ్చిపోయిన పవన్ బ్యూటీ.. వీడియో వైరల్..!

Ameesha Patel: టాలీవుడ్ లో కేవలం ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాలో నటించి.. కుర్రకారు కలల రాణిగా పేరు సంపాదించింది.. అయితే ఆ తరువాత మరే సినిమాలో కూడా తెలుగులో నటించలేదు ఈ ముద్దుగుమ్మ.. కానీ బాలీవుడ్లో అడుగుపెట్టి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్ గానే నటిస్తోంది అమీషా పటేల్.

@48 లో కూడా చెక్కుచెదరని అందం..

Ameesha Patel: Pawan beauty in bikini.. Video viral..!
Ameesha Patel: Pawan beauty in bikini.. Video viral..!

నిరంతరం సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటూ 48 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో గుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.. నిరంతరం సోషల్ మీడియాలో ఈమె అందం గురించి హాట్ టాపిక్ గా మారేలా చేస్తూ ఉంటుంది. అమీషా పటేల్ సోషల్ మీడియాలో బికినీలో ఉన్న కొన్ని ఫోటోలను , వీడియోలను సైతం షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 48 ఏళ్ల వయసులో ఇంతఫిట్టుగా అందంగా కనిపిస్తూ ఉండడంతో పాటు టోల్డ్ ఫిజిక్ ని మెయిన్టైన్ చేయడంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మ పైన ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు.

బికినీలో గ్లామర్ బ్యూటీ..

అయితే అమీషా పటేల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఏదో స్విమ్మింగ్ పూల్ వద్ద దిగినటువంటి బికినీ ఫోటోలు లాగా కనిపిస్తున్నాయి.. స్వేచ్ఛగా తన హావ భావాలను పలికిస్తూ అందంతో మరింత ఆకర్షియనీయంగా కనిపిస్తోంది అమీషా పటేల్.. అయితే ఈ ఫోటోలకు వీడియోలకు సైతం వేసవికాలం అంటూ క్యాప్షన్ ని జోడించింది ఈ ముద్దుగుమ్మ. పింక్ కలర్ గ్లామ్ మేకప్ లుక్ లో అదరగొట్టేస్తోంది అమీషా పటేల్.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా సినిమాలలో నటిస్తూ ముందుకు వెళ్తోంది.

- Advertisement -

అమీషా పటేల్ కెరియర్..

అమీషా పటేల్ బాలీవుడ్లో 2000 సంవత్సరంలోనే కహోనా ప్యార్ హై తో మొదటిసారి తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. తన నటనతో ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులను కూడా చూసింది. ఇటీవల వరుస ప్లాపులు ఎదురవుతున్న సమయంలో గదర్ -2 చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది అమీషా పటేల్. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఇలా బాలీవుడ్ లోనే వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకుల అలరిస్తున్న ఈమె కాస్త సమయం దొరికితే చాలు ఇలా ట్రెండీగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా అమీషా పటేల్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరియర్..

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇప్పటివరకు బిజీగా ఉన్న విషయం తెలిసింది ఇక జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ తెలియనున్న నేపథ్యంలో ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ ఆయన ప్రకటించిన సినిమా షూటింగ్లలో పాల్గొనబోతున్నారు.. మొత్తానికి అయితే బద్రి సినిమా ద్వారా వీరిద్దరికీ మరింత పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు