Tollywood Fastest 100K Liked Trailers: తక్కువ సమయంలో సత్తా చాటిన ట్రైలర్స్..!

Tollywood Fastest 100K Liked Trailers:  సినిమా విడుదలవుతుందంటే చాలు సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఒకచోట చేర్చి ట్రైలర్ రూపంలో విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలోని ఏ సినిమా ట్రైలర్ విడుదలైనా సరే ప్రేక్షకులకు నచ్చితే అతి తక్కువ సమయంలోనే విపరీతమైన లైక్స్ను సాధిస్తుందటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే 100K లైక్స్ సాధించిన చిత్రాల ట్రైలర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.

సలార్:

Salaar
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో తెరకెక్కించిన చిత్రం సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్.. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై అతి తక్కువ సమయంలోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ సినిమా.. ట్రైలర్ విషయంలో కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. డిసెంబర్ 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. కేవలం 3 నిమిషాలలోనే 100 K లైక్స్ సాధించి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ సాధించిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.

- Advertisement -

భీమ్లా నాయక్:

Bheemla nayak
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా హీరో రానా కలిసి మల్టీస్టారర్ గా తెరకెక్కించిన చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల మోత మోగించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశీ నిర్మించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కూడా ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కాగా విడుదలైన 4 నిమిషాల్లోనే 100K లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

వకీల్ సాబ్:

Vakeel saab
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష, బోనీకపూర్ నిర్మించిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. అనన్య నాగళ్ళ, అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషించారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ సినిమాగా వచ్చిన వకీల్ సాబ్ భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. విడుదలైన 7 నిమిషాలలోనే ఏకంగా 100K లైక్స్ సాధించింది.

RRR:

RRR
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి మల్టీ స్టారర్ గా తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాతో వీరికి గ్లోబల్ స్టార్ స్టేటస్ లభించడమే కాదు ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో సినిమాపై అంచనాలను పెంచడానికి ట్రైలర్ కూడా అంతే దోహద పడింది. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 8 నిమిషాలలోనే 100K లైక్స్ సాధించి అప్పట్లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే

ఆది పురుష్:

Adhipurush
రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా తెరకేక్కించిన చిత్రం ఆది పురుష్ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ట్రైలర్ విడుదలైన 9 నిమిషాలలోనే 100K లైక్స్ సాధించింది.

సర్కారు వారి పాట:

Sarkari vaari paata
మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. రూ .60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి.. పక్కా కమర్షియల్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైన 9 నిమిషాలలోనే 100K లైక్స్ సాధించింది..

గుంటూరు కారం:

Guntur kaaram
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. నిన్న (ఆదివారం) ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా 15 నిమిషాలలోనే 100 కే లైక్స్ సాధించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు