Mahesh Babu: ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజైన మహేష్ సినిమాలు… ఎన్ని హిట్స్ అంటే?

Mahesh Babu:  టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ సంక్రాంతి కావడంతో పాటు, ఆ పండగ సంబరాన్ని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక అదే సమయంలో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలను చూడడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇదే అదనుగా టాలీవుడ్ మేకర్స్ సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే సంక్రాంతిని సెంటిమెంట్ గా భావిస్తూ ఫ్యామిలీ కంటెంట్ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి స్టార్ హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో మహేష్ బాబు కూడా ఒకరు. ఈ సారి సంక్రాంతికి కూడా మహేష్ బాబు “గుంటూరు కారం” మూవీతో జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటిదాకా మహేష్ బాబు హీరోగా నటించిన ఎన్ని సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి? అందులో ఎన్ని హిట్స్ పడ్డాయి? అనే వివరాల్లోకి వెళితే…

1) టక్కరి దొంగ

takkari donga
మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన “టక్కరి దొంగ” మూవీ 2002లో జనవరి 16న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ మూవీ ఏకంగా 5 నంది అవార్డులు గెలుచుకుని ఆ సంక్రాంతికి బెస్ట్ మూవీగా నిలిచింది. అలాగే 4.8 కోట్ల షేర్ రాబట్టింది. కౌబాయ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు లిసా రాయ్, బిపాస బసు మహేష్ బాబుతో రొమాన్స్ చేశారు.

- Advertisement -

2) ఒక్కడు

okkadu
మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ కీలకమైన మైలురాయి “ఒక్కడు” మూవీ. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ 15 జనవరి 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ 9 కోట్లు అయితే, రిలీజ్ అయ్యాక వచ్చిన కలెక్షన్లు 39 కోట్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడిందో. 21 కోట్ల షేర్ ను కొల్లగొట్టిన “ఒక్కడు” మూవీ మహేష్ బాబు కెరీర్‌ కు బూస్ట్ ఇచ్చింది.

3) బిజినెస్ మ్యాన్

businessman
మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మరో సూపర్ హిట్ బొమ్మ “బిజినెస్ మ్యాన్”. 2006లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన “పోకిరి” అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ తర్వాత మహేష్- పూరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ “బిజినెస్ మ్యాన్” 13 జనవరి 2012లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు కాగా, 90 కోట్లు కలెక్షన్లు, 40.40 కోట్ల షేర్ రాబట్టి 2012లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా, మహేష్ కెరీర్లో ఫస్ట్ 90 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది.

4) సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు

seethama vakiltlo
టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసిన మూవీ, మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్టర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు”. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా 11 జనవరి 2013 విడుదలైంది. సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకుల మూడ్ కు తగ్గట్టుగా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు కాగా, 85 కోట్లు కలెక్షన్లు, 51 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది. అక్కడితో ఆగకుండా 4 నంది అవార్డ్స్ సొంతం చేసుకోవడంతో పాటు, సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా మరో రికార్డును క్రియేట్ చేసింది. ఫస్ట్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ “అత్తారింటికి దారేది”.

5) 1 – నేనొక్కడినే

Nenokkadine
లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా రూపొందిన “1 – నేనొక్కడినే” మూవీ 10 జనవరి 2014లో విడుదలైంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో మహేష్ బాబును సుకుమార్ సరికొత్తగా ప్రజెంట్ చేశారు. 60 – 70 కోట్ల హై బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 29 కోట్ల షేర్ రాబట్టి, ఊహించని విధంగా కమర్షియల్ గా ఫెయిల్ అయింది.

6) సరిలేరు నీకెవ్వరు

sarileru neekevvaru
మహేష్ బాబు కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందిన మరో చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాతో మహేష్ బాబులో ఉన్న మరో సరికొత్త యాంగిల్ హ్యూమర్ ను బయట పెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా 11 జనవరి 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 75 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 260 కోట్ల కలెక్షన్లు, 138 కోట్ల షేర్ కొల్లగొట్టి, కలెక్షన్ల పరంగా 2020లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా సరికొత్త రికార్డును తన పేరు మీద రాసుకుంది.

కాగా మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు సంక్రాంతికి 6 సినిమాలు వచ్చాయి. అందులో “1 – నేనొక్కడినే” మూవీ మాత్రమే కమర్షియల్‌గా డిజాస్టర్ గా నిలిచింది. “టక్కరి దొంగ” మూవీ కూడా చెప్పుకోదగ్గ హిట్ ఏం కాదు. కానీ ఆ మూవీ ఓ వర్గం ఆడియన్స్ కు ఇప్పటికీ ఫేవరెట్ మూవీనే. 2012, 2013, 2014 వరుసగా మూడు సార్లు సంక్రాంతి పోటీలో నిలిచి, మంచి హిట్స్ అందుకున్నాడు. అందుకే మహేష్ కు సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సెంటిమెంట్‌తో ఈ సారి కూడా మహేష్ సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడుతారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే సంక్రాంతికి బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఇది నిజం అయ్యే ఛాన్స్‌లే ఎక్కువ ఉన్నాయని సినీ క్రిటిక్స్ అంచాన వేస్తున్నారు. చూడాలి మరి.. సెంటిమెంట్ వర్క్ అవుట్ అయి… ఈ సారి సంక్రాంతికి విన్నర్‌గా నిలుస్తుడా? లేదా బొక్కబోర్లాపడిపోతాడా?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు