Bollywood Movie: రాజమౌళిని బాధ పెట్టిన హిందీ సినిమా

దర్శకుధీరుడు, ప్లాప్ తెలియని డైరెక్టర్ అంటూ ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో పేర్లు వచ్చాయి. దీనికి కారణం ఆయనకు ఉన్న దర్శకత్వ ప్రతిభ మాత్రమే. ఈయన నుంచి వచ్చిన సినిమాలను చూసి హాలీవుడ్ దర్శకులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక బాలీవుడ్ దర్శకులు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి రాజమౌళి ఓ హిందీ మూవీ చూసి బాధ పడ్డారట. రాజమౌళిని బాధ పెట్టిన మూవీ ఏంటి..? దాని వెనక ఉన్న కథేంటి అనే వివరాల్లోకి వెళ్తే…

బాలీవుడ్ కండల వీరుడు హీరోగా భజరంగీ భాయిజాన్ అనే ఓ సినిమా వచ్చింది. ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. కేవలం 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఏకంగా 950 కోట్లకు పైగా వసూళ్లు చేసి సల్మాన్ ఖాన్ ఓ బ్లాక్ బస్టర్ హిట్‌ని ఇచ్చింది. కాగా, ఈ సినిమాకు విజేయంద్ర ప్రసాద్ కథను అందించిన సంగతి తెలిసిందే.

నిజానికి విజేయంద్ర ప్రసాద్ ఎలాంటి కథ రాసినా ముందుగా రాజమౌళికి వినిపిస్తాడు. ఈ భజరంగీ భాయిజాన్ కథను కూడా ముందుగా జక్కన్నకు వినిపించారట. మొదటి 30 నిమిషాల కథ విన్న తర్వాత… ఈ స్టోరీ తనకు సెట్ అవ్వదని, వేరే వాళ్లకు ఇవ్వుమని విజేయంద్ర ప్రసాద్ కు జక్కన్న చెప్పారట. దీంతో ఈ స్టోరీ సల్మాన్ ఖాన్ కు వినిపించారట. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారట.

- Advertisement -

ఎక్ ది టైగర్ అంటూ సల్మాన్ ఖాన్ కు ఓ హిట్ సినిమా ఇచ్చిన కబీర్ ఖాన్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని సల్మాన్ ఖాన్ అనుకున్నారట. అలా… రాజమౌళి చేయాల్సిన ప్రాజెక్ట్ కబీర్ ఖాన్ కు వచ్చింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు సినిమా చూసిన తర్వాత జక్కన్న ఓ మంచి స్టోరీని మిస్ చేసుకున్నా అంటూ బాధ పడ్డారట.

విజయేంద్ర ప్రసాద్ తనకు ముందుగా కథ చెప్పిన టైంలో వేరే సినిమా బిజీలో ఉన్నారట. ఆ టైం కాకుండా ఇంకెప్పుడైనా రాజమౌళికి స్టోరీ చెప్పి ఉంటే.. భజరంగీ భాయిజాన్ మూవీ మరోలా ఉండేది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు