Vijayendra Prasad : వివాదంతో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ డెసిషన్

Vijayendra Prasad : ట్రిపుల్ ఆర్ సినిమా కథతో గొప్ప రైటర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ తాజాగా అదే మూవీ వల్ల చిక్కుల్లో పడ్డారు. “ఆర్ఆర్ఆర్” సినిమాపై, అందరూ తారక్ పై తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదంతో విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

“ఆర్ఆర్ఆర్” సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రపంచవ్యాప్తంగా స్టార్ డం లభించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ నడిచింది. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు అంటూ రాజమౌళిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత రాజమౌళి ఇచ్చిన వివరణతో వివాదం సద్దుమణిగింది. కానీ ఆయన తండ్రి మాత్రం మరోసారి “ఆర్ఆర్ఆర్”లో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై తన ఒపీనియన్ చెప్పి కాంట్రవర్సీకి కారణమయ్యారు.

తను కథ రాసుకున్నప్పుడు రెండు పాత్రలు ఒకే లాగా అనిపించాయని, కానీ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ పాత్రకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని, ఎన్టీఆర్ పాత్రలో కేవలం అమాయకత్వం మాత్రమే ఉందని, ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేసినట్టుగా అనిపించిందని, కానీ ఆయన పాత్ర వల్లే కథ ముందుకు వెళుతుందని, ఇక రామ్ చరణ్ ను కేవలం రామరాజుగా చూపించామని, కానీ అది రాముడిలాగా అనిపించడంతో ఎఫెక్టివ్ గా అనిపించిందని విజయేంద్ర ప్రసాద్ తన ఒపీనియన్ ఏంటో చెప్పారు. దీంతో ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇక ఇదే అదనుగా ఎన్టీఆర్ హేటర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఉండడంతో ఆ వివాదం పెద్దదయింది.

- Advertisement -

ఈ వివాదం కారణంగా విజయేంద్ర ప్రసాద్ మీడియాకు దూరంగా ఉండాలి అనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో పట్టాలెక్కనున్న SSMB 29 స్క్రిప్ట్ పనుల్లో విజయేంద్రప్రసాద్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు పూర్తయ్యే దాకా మీడియాకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాలయ్య తారక్ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ తో బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ ను తక్కువ చేస్తూ చేస్తున్న కామెంట్స్ తో మరో కొత్త వివాదానికి దారి తీసినట్టు అయ్యింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు