Ram charan: తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు…

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి ఫాలోయింగ్ గురించి ఈ జెనరేషన్ లో ఏ తెలుగు వాడైనా ఇట్టే చెప్పేస్తాడు. పదేళ్లు రాజకీయాల్లో ఉండి సినిమాలకు దూరమైనా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే నార్త్ లో మాత్రం చిరు అంత క్రేజ్ సంపాదించలేదు. కారణాలు ఏమైనా 90స్ లో చిరు చేసిన కొన్ని సినిమాలు బెడిసికొట్టడం వల్ల బాలీవుడ్ జోలికి పోలేదు. కానీ తన కొడుకు రామ్ చరణ్ మాత్రం తండ్రిని క్రేజ్ ని బీట్ చేస్తూ నార్త్ లో అద్భుతమైన ఫాలోయింగ్ ని సంపాదించాడు.

మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ ని సంపాదించిన రామ్ చరణ్ RRR తర్వాత వరల్డ్ వైడ్ గా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో పదేళ్ల కింద ఎంత ట్రోలింగ్ కి గురయ్యాడో, వాళ్ళతోనే రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అని పిలిపించుకున్నాడు. ఇక తాజాగా చిరంజీవి , రాంచరణ్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామ మందిరం లో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ట కి ఆహ్వానాన్ని పొందిన విషయం తెలిసిందే.

ఇక టాలీవుడ్ నుండి వెళ్లిన అతికొద్ది మంది నటుల్లో ఈ తండ్రి కొడుకులు నిలవగా, తాజాగా అయోధ్య మందిర ప్రాంగణం లో రామ్ చరణ్, చిరంజీవి ని అనిల్ అంబానీ పలకరించడం జరిగింది. అక్కడ ఎంతో మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఉన్నా, ఈ తండ్రి కొడుకులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. అక్కడ ఓ హిందీ న్యూస్ ఛానల్ మీడియా వీరిని స్పెషల్ గా కవర్ చేస్తూ చూపించాడు. దానికి పక్కన ఎవరో ఎందుకు ఎక్కువ సేపు వాళ్లనే చూపిస్తున్నావ్.. ఫ్రేమ్‌లో ఎవరున్నారు అంటూ వేరే వ్యక్తి అడగగా, అక్కడ రామ్ చరణ్ ఉన్నాడు.. రామ్ చరణ్ తండ్రి కనిపిస్తున్నాడు.. అందుకే చూపిస్తున్నా అని అంటాడు.

- Advertisement -

అంటే నార్త్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ గా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అని అందరూ గుర్తు పట్టాలి.. కానీ అక్కడ మాత్రం రామ్ చరణ్ తండ్రి చిరంజీవి నార్త్ వాళ్ళు అంటున్నారంటే ఇంతకన్నా రామ్ చరణ్ కి ఇంకేం కావాలి అంటూ మెగా ఫ్యాన్స్ ఈ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు