Shankar : “గేమ్ ఛేంజర్” సాలిడ్ అప్డేట్.. చరణ్ ఫ్యాన్స్ కి పండగే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “గేమ్ ఛేంజర్” సినిమా షూటింగ్ షెడ్యూల్ తాజాగా మళ్ళీ మొదలైంది. మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా గత కొన్నాళ్లుగా షూటింగ్ వాయిదా పడగా, ఆ గ్యాప్ లో రామ్ చరణ్ మెగా ఈవెంట్లలో కాలం గడుపుతుంటే శంకర్ ఇండియన్ 2 సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే తాజాగా సంక్రాంతి తర్వాత గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఓ ఫ్యాక్టరీ లో ఫైట్ సీన్లు షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా నుండి తాజాగా అభిమానులకు ఓ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. గేమ్ ఛేంజర్ కోసం దాని రిలీజ్ డేట్ కోసం మెగా అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమాని సెప్టెంబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఇంత కన్నా గుడ్ న్యూస్ ఉండదు.

లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత మెగా హీరోల నుండి వచ్చిన ఏ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. చిన్న హీరోలను పక్కన పెడితే చిరు చేసిన భోళా శంకర్, పవన్ కళ్యాణ్ బ్రో వాళ్ళ స్థాయికి తగ్గ సినిమాలు కూడా కాదని మెగా అభిమానులు ఫీలయ్యారు. ఇక రామ్ చరణ్ రెండేళ్ల కింద వచ్చిన RRR , ఆచార్య తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ చరణ్ అభిమానుల ఆకలి తీరుస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ కే గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే అఫిషియల్ అప్డేట్ రానుంది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు