Unmarried Star’s: 40 యేళ్లు దాటినా పెళ్లికి దూరం అంటున్న స్టార్స్ వీళ్ళే..!

Unmarried Star’s: సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్స్ కి కొదవే లేదు.. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు . ఇక అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఎప్పుడు వివాహం చేసుకుంటారు అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇదే విషయాన్ని స్టార్స్ ని అడిగితే మాత్రం వారు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పటికీ ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తూ సింగిల్గానే మిగిలిపోయిన సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పాలి. ప్రస్తుతం ఈయన వయసు 60 ఏళ్లు.. ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఇక చేసుకుంటాడనే నమ్మకం కూడా లేదు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈయన వయసు 45 సంవత్సరాలు. అయినా ఇంకా పెళ్లికి మాత్రం దూరంగానే ఉన్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నా అవన్నీ కేవలం పుకార్లు గానే మిగిలిపోతున్నాయి.

ఇక ఇండస్ట్రీలో మరో మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్.. ప్రస్తుతం ఈయన వయసు 46 ఏళ్ళు.. ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. రెండుసార్లు ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళాడు . కానీ మధ్యలోనే అవి పెళ్లి వరకు వెళ్లకుండా ఆగిపోయాయి. ఇక 40 ఏళ్లు దాటిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో తరుణ్ కూడా ఒకరు . లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం తరుణ్ వయసు 41 సంవత్సరాలు. ఇక హీరోలే కాదు హీరోయిన్లు కూడా నాలుగు పదుల వయసు దాటినా ఇంకా వివాహానికి దూరంగానే ఉన్నారు. ఇక అలాంటి వారిలో అనుష్క, త్రిష, నగ్మా, టబు, శోభన, సితార ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోయిన్లు వివాహానికి దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే వ్యక్తిగత కారణాలవల్లే వీరు ఇలా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. ఇక వీరు ఇప్పటికైనా వివాహం చేసుకుంటారా లేక ఒంటరిగానే మిగిలిపోతారా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు