Varsha Bollmma: ఆ పనులు… తన తల్లిని ఏడిపించిన హీరోయిన్‌..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు, మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలుగు తెరకు పరిచయమై తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల చూపును తన వైపునకు తిప్పుకుంది అందాల ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. మన దగ్గర అమ్మాయిలా కనిపించే రూపంతో ఆకట్టుకుంటూ కుర్రకాలను ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ. ఈ మధ్య గ్లామర్ మీద కూడా ఫోకస్ పెడుతూ అప్పుడప్పుడు ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.

అయితే….’96’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘స్టాండప్ రాహుల్’ వంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై సొగసరి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ దక్షిణాదిన బిజియస్ట్ హీరోయిన్ గా మారింది. ‘ఊరు పేరు భైరవకోన’తో సినీ ప్రియులను థ్రిల్ కు గురి చేయడానికి సిద్ధమయ్యారు నటి వర్ష బొల్లమ్మ. సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వర్ష ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్లాన్ గురించి మాట్లాడారు వర్ష బొల్లమ్మ. కెరీర్ పరంగా ప్రస్తుతం సంతృప్తిగా ఉన్నానన్నారు. తనకు ముందు నుంచి తల్లిదండ్రుల సపోర్ట్ ఉందని చెప్పారు. తాను ఏం చేసినా సూపర్ అని పొగుడుతారని అన్నారు. ఏదైనా పెళ్లి సీనులో నటిస్తే అమ్మ ఏడుస్తుందని… అయితే అది నిజం కాదని ఓదారుస్తానన్నారు. తనకు మరో మూడు నాలుగేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని చెప్పారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు