Kiran Rathod: యాప్ లో అలాంటి వీడియోలు పెట్టి టార్చర్ చేశారు – కిరణ్ రాథోడ్

ఇటీవల తెలుగు బిగ్ బాస్-7 సీజన్ ముగిసింది.. ఇందులో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ కిరణ్ రాథోడ్ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.. బిగ్ బాస్ వల్ల ఈమెకు పెద్దగా క్రేజ్ పెరగలేదు.. 2001లో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కిరణ్ రాథోడ్.. ఈమె జెమిని, నువ్వు లేక నేను లేను తదితర చిత్రాలలో నటించింది. బోల్డ్ తరహా పాత్రలలో కనిపిస్తూ తనదైన ముద్ర వేసుకుంది కిరణ్ రాథోడ్..

అయితే ఈ కిరణ్ రాథోడ్ ఎవరో కాదు బాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి రవీనా టాండన్ కి కజిన్ అవుతుంది.. శృంగార తారగా పేరుపొందిన షకీలా హోస్ట్ గా చేసినటువంటి ఒక షోలో పాల్గొన్న కిరణ్ రాథోడ్ తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది.. ఇందులో కిరణ్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమా అవకాశాలు తగ్గడంతో తానే స్వయంగా ఒక యాప్ ని ప్రారంభించానని.. ఆ యాప్ లో తన వీడియోలను ఫోటోలను సైతం పోస్ట్ చేస్తూ ఉంటానని తెలిపింది..

అయితే దర్శక నిర్మాతలు ఆ వీడియోలు చూసి తనకు అవకాశాలు ఇస్తారేమో అని అనుకున్నానని.. కానీ అలా జరగలేదని.. కొంతమంది అవే ఫోటోలు ,వీడియోలు తనకు షేర్ చేస్తూ డబ్బులు ఇస్తాను కమిట్మెంట్ ఇస్తారా అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడే వారని.. అలా మెసేజ్ ,కాల్స్ వరుసగా వస్తూ ఉండడంతో ఆ యాప్ ని ఆపేశాను అంటూ తెలిపింది కిరణ్ రాథోడ్..ఇంస్టాగ్రామ్ లో కూడా ఇలాంటి వీడియోలు, పోస్టులు చేస్తున్నప్పటికీ అవకాశాల కోసమే ఇలా చేశానని.. కానీ వాటి పైన కూడా చాలామంది నెగటివ్ గానే కామెంట్లు చేస్తున్నారంటూ వెల్లడించింది..

- Advertisement -

కమిట్మెంట్ కి ఇలా హింట్ ఇస్తున్నావా అంటూ మరికొంతమంది చాలా దారుణంగా కామెంట్లు చేశారని .. తాను ఇప్పటివరకు ఎలాంటి శృంగార చిత్రాలలో నటించలేదంటూ కూడా వెల్లడించింది.. కానీ తనపైనే ఇలాంటి ముద్ర వేస్తున్నారంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.. నాకు ఇష్టమైన దుస్తులను ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా..ఇలా అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది.. గతంలో కూడా ఒక వ్యక్తిని ప్రేమించి నాలుగేళ్లు అతనితో రిలేషన్ లో ఉన్నాను.. అతడు మంచివాడు కాదని..అతని చేతిలో మోసపోయానని తెలిసేలోపు ఎన్నో సినిమా అవకాశాలను వదులుకున్నానని తెలిపింది కిరణ్ రాథోడ్..

ఈ విషయాలన్నీ షకీలా ఇంటర్వ్యూలో వెల్లడించింది.. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని.. తాను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల తన జీవితం ఇలా అయిపోయిందంటూ తెలిపింది.. ఆఫర్స్ వస్తే కచ్చితంగా నటించాలని ఉందంటూ తెలిపింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు