Ustaad Bhagat Singh Update: ఎన్నికల వేడిని పెంచే అప్డేట్… పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో బిజీగా ఉండడం వల్ల ఇప్పట్లో ఆయన సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కొత్త సినిమా నుంచి ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రం “ఉస్తాద్ భగత్ సింగ్” అంటూ సర్ప్రైజ్ చేశాడు. మరి ఎన్నికల వేళ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు “ఉస్తాద్ భగత్ సింగ్” మేకర్స్ ఇవ్వబోతున్న ఆ ఊహించని అప్డేట్ ఏంటి ? అంటే…

ఊహించని అప్డేట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా త్వరలోనే “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానుంది అంటూ సోషల్ మీడియా వేదికగా అన్ ఎక్స్పెక్టెడ్ పోస్ట్ తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమేనని నిరాశలో ఉన్న ఫ్యాన్స్ ఈ ఊహించని అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు. మొత్తానికి ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్ అనే చిన్న లైన్ తోనే క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. దీంతో అసలు ఆ అప్డేట్ ఏంటి అనే చర్చ మొదలైపోయింది.

ఎన్నికల వేడిని పెంచే అప్డేట్ ఇదేనా?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అందరి చూపు అక్కడే ఉంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సారి ఎలక్షన్స్ లో పోటీ చేస్తుండడంతో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల కారణంగానే పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్స్ కి లాంగ్ బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎలక్షన్స్ అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని, ముందుగా “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీని పూర్తి చేస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఊహించని విధంగా త్వరలోనే మూవీ నుంచి అప్డేట్ ఉంటుంది అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. అయితే కచ్చితంగా ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని, అదికూడా ఎన్నికల వేడిని మరింత పెంచే విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇంతకీ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ప్లాన్ చేశారో తెలుసుకోవాలని తహతలాడిపోతున్నారు పవన్ అభిమానులు.

- Advertisement -

“ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే…
డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అనగానే ఎగిరి గంతేసినంత పని చేశారు మెగా ఫ్యాన్స్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు తిరగరాసిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే మరోసారి ఈ కాంబో రిపీట్ అనగానే పట్టలేనంత ఆనందంలో మునిగిపోయారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆగిపోయింది. అయితే తనకు దొరికిన ఆ అతి తక్కువ సమయంలోనే హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కొంతవరకు ఫాస్ట్ ఫాస్ట్ గా పూర్తిచేసి ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు. ఇక ఆ తర్వాత పవన్ రాజకీయాలపై ఫోకస్ చేయడం వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఒకానొక టైంలో ఈ మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పటిదాకా ఫస్ట్ గ్లింప్స్ మినహా ఇతర అప్డేట్స్ ప్రకటించని టీం ఇప్పుడు సడన్ గా “ఉస్తాద్ భగత్ సింగ్” అప్డేట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు