Squid Game Actor: 79 ఏళ్ల వయసులో జైలు శిక్ష… లైంగిక వేదింపుల కేసులో దోషిగా తీర్పు

“స్క్విడ్ గేమ్” అనే వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన ఓ సీనియర్ యాక్టర్ 79 ఏళ్ల వయసులో జైలు పాలయ్యాడు. అది కూడా లైంగిక వేధింపుల కేసులో. మరి ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? ఆ కేసు కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

“స్క్విడ్ గేమ్” తాతకు జైలు శిక్ష…
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఒరిజినల్ సిరీస్ గా వచ్చిన కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ “స్క్విడ్ గేమ్”. ఈ వెబ్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ దక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సిరీస్ మొదటి భాగంలోని నటీనటుల యాక్టింగ్ కు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. భాష, బేధం లేకుండా “స్క్విడ్ గేమ్”కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ యాక్టర్ యోంగ్ కూడా కీలకపాత్రను పోషించారు. 79 ఏళ్ల ఈ దక్షిణ కొరియా నటుడికి తాజాగా లైంగిక వేధింపుల కేసులో శిక్ష పడడం అందరిని షాక్ కు గురి చేస్తుంది. మార్చ్ 15న సెక్సువల్ హెరాస్మెంట్ కేసులో యోంగ్ దోషిగా తేలాడు. సువన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఓ యోంగ్ సుకు 8 నెలల జైలు శిక్షను విధించినట్టు సమాచారం. అలాగే రెండేళ్ల పాటు ఆయన సినిమాలో నటించకూడదంటూ నిషేధం కూడా విధించారు. 2017లో నమోదైన ఈ కేసులో ఇన్నేళ్లకు తీర్పు వచ్చింది.

ఇదేం బుద్ధి తాతా?
79 ఏళ్ల వయస్సు ఉన్న యోంగ్ పై రెండు సార్లు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2017లో మొదటిసారి వచ్చిన ఈ ఆరోపణలను యోంగ్ కొట్టి పారేశాడు. ఓ సరస్సు చుట్టూ నడవడానికి హెల్ప్ చేసేందుకే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్టు గతంలో యోంగ్ చెప్పుకొచ్చాడు. ఆమె గొడవ చేయకుండా ఉంటుందని క్షమాపణలు చెప్పానని, అలాగని ఆ లైంగిక ఆరోపణలను తను ఒప్పుకున్నట్టు కాదని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత బాధితురాలి వాదనలు, దానికి సంబంధించిన రికార్డులు, సాక్ష్యాలు కూడా ఉండడంతో వాటిని కొట్టి పారేయలేమని న్యాయమూర్తి జియోంగ్ యోన్ జు పేర్కొన్నారు. మొత్తానికి ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగింది అంటున్నారు నెటిజెన్లు. కాగా తీర్పు అనంతరం కోర్టు బయటకు వచ్చిన తర్వాత యోంగ్ మీడియాతో మాట్లాడుతూ తను నెక్స్ట్ తీసుకునే స్టెప్ గురించి బయట పెట్టారు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించాడు. అయితే ఈ అప్పీల్ చేయడానికి ఆయనకు ఇంకా వారం రోజుల సమయం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

అసలేం జరిగిందంటే….
2017లో థియేటర్ ప్రదర్శన కోసం ఓ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన యోంగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. వాకింగ్ చేసే దారిలో బాధితురాలు నివాసం ఉండగా, అక్కడే ఆయన ఇలా దారుణంగా వ్యవహరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా 2022లో కూడా ఓ మహిళను యోంగ్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న యోంగ్ కి స్క్విడ్ గేమ్ సిరీస్ సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టగా, ఈ లైంగిక ఆరోపణలు ఆయన కెరీర్ కు మాయని మచ్చలా అంటుకున్నాయి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు