Bade Miyan Chote Miyan : మొత్తం దాన్నే దించినట్టుంది!

Bade Miyan Chote Miyan : బాలీవుడ్ లో గత రెండు మూడేళ్ళుగా వరుసగా యాక్షన్ సినిమాలు ఏలుతున్నాయి. లాక్ డౌన్ తర్వాత రెండేళ్ల పాటు ఎలాంటి సినిమా వచ్చినా డిజాస్టర్స్ కావడంతో మేకర్స్ కాస్త ట్రాక్ మార్చి సెంటిమెంట్ డ్రామాలతో నెట్టుకొచ్చారు. కానీ ఎప్పుడైతే పఠాన్ సినిమా హిట్ అయిందో మళ్ళీ పాత పంథాని అనుసరించి వరుసబెట్టి యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. అయితే కంటెంట్ డిఫరెంట్ గా ఉండి బాగుంటే పరవాలేదు. కానీ గత కొన్ని సినిమాలని గమనిస్తే దాదాపు గత రెండు మూడేళ్ళుగా బాలీవుడ్ లో శత్రుదేశాలని అదే పనిగా విలన్ గా, లేదా నెగిటివ్ గా చూపిస్తూ దాని చుట్టే హీరోయిజంని నడిపించే సినిమాలు ఎక్కువైపోయాయి. షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ అలాగే, సల్మాన్ ఖాన్ టైగర్3 లో అదే ఫార్మాట్ లో తెరకెక్కాయి. ఇక హృతిక్ రోషన్ ఐదేళ్ల కింద నటించిన వార్ సినిమా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అలాగే ఏదో వసూళ్లు బాగానే వచ్చినా ప్రేక్షకుల నుంచి ఆశించిన విజయం దక్కలేదు. ఫైటర్ లోనూ ఇదే చేశారు, కానీ హృతిక్ రోషన్ ఇమేజ్ పుణ్యమాని మరీ డిజాస్టర్ ఓపెనింగ్స్ తో గట్టెక్కింది.

ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు ‘బడే మియా చోటేమి యా’ ( Bade Miyan Chote Miyan  ) అంటూ ఏప్రిల్ 10 రంజాన్ కానుకగా యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. ఇక మలయాళ స్టార్ సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో ఆడియన్స్ ఈజీగా ఊహించే కథను అరటిపండు వలిచినట్టు సింపుల్ గా చెప్పేశాడు. ఒకడు ప్రమాదకరమైన ఆయుధాలు తయారు చేస్తూ దేశానికి చీడపురుగులా మారతాడు. అతనెలా ఉంటాడో ఎవరికి తెలియదు. వీడిని పట్టుకోవడం కోసం గవర్నమెంట్ సైకో ఆర్మీ ఆఫీసర్లుగా పేరున్న బడే మియా, చోటే మియాలను రంగంలోకి దించుతుంది. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థ చేయలేని పనిని వాళ్లిద్దరూ ప్రాణాలకు తెగించి పూర్తి చేస్తారు. అదే కథ. అదే రుద్దుడు.

ఇదే కాన్సెప్ట్ తో ఇంతకు ముందు టైగర్ ష్రాఫ్ నటించిన పలు యాక్షన్ డ్రామాలు తెరకెక్కాయి. అలాగే సల్మాన్ ఖాన్ టైగర్ 2,3, రీసెంట్ గా షారుఖ్ పఠాన్ ఇవే కథాంశం చుట్టూ తిరుగుతాయి. ఇక బడే మియా చోటే మియా ట్రైలర్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత గ్రాండియర్ గా ఉన్నా ఓవర్ అనిపించే బ్లాస్టులు, ఛేజ్ లతో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ సినిమా మొత్తాన్ని చెవులు పగిలేలా హోరెత్తించేలా ఉన్నాడు. అక్షయ్, టైగర్ ఇద్దరూ గత కొంత కాలంగా ఫామ్ లో కూడా లేరు. అలాంటిది టైంలో ఇంత ఓవర్ ది బోర్డ్ వయొలెన్స్ తో వస్తే ట్రోలింగ్ చేయకుండా నెటిజెన్లు ఉంటారా అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈద్ పండగ కాబట్తి ఓపెనింగ్స్ కి ఢోకా లేకపోవచ్చు, కానీ బాక్సాఫీస్ దగ్గర నెగ్గుకురావడం అంత సులభమైతే కాదు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ దృష్ట్యా రిలీజ్ అయ్యాక రివ్యూలు కూడా రొట్ట సినిమా అని తేల్చేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అప్పట్లో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా వార్ ఎలాంటి విజయం సాధించిందో అలా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు