Pushpa 2 : కఠినమైన డైట్… “పుష్ప 2” కోసం కడుపు మాడ్చుకుంటున్న బన్నీ

Pushpa 2 : మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2” కోసం డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ను తెగ కష్టపెడుతున్నారట. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ కడుపు మాడ్చుకుని మరీ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కఠినమైన డైట్ ఫాలో అవుతూ సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ను బయట పెడుతున్నారు అల్లు అర్జున్. మరి ఇంతకీ “పుష్ప 2” (Pushpa 2)కోసం బన్నీ ఫాలో అవుతున్న ఆ కఠినమైన డైట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

బన్నీ షాకింగ్ డైట్…

బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”కు సీక్వెల్ గా “పుష్ప 2” రూపొందుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ డైట్ గురించిన వివరాలు బయటకు వచ్చాయి. సాధారణంగా తాను ఫాలో అయ్యే డైట్ కంటే “పుష్ప 2” కోసం డిఫరెంట్ ప్లాన్ ను ఫాలో అవుతున్నాడట అల్లు అర్జున్. ముఖ్యంగా మాంసాహారాన్ని ముట్టుకోవట్లేదని తెలుస్తోంది. “పుష్ప” షూటింగ్ టైంలో మాత్రం సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హ్యాపీగా మాంసాహారాన్ని లాగించేసాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు కేవలం కాయలు దుంపలు అంటూ ప్రత్యేకమైన డైటీషియన్ ను అపాయింట్ చేసుకొని మరీ కొత్త డైట్ ఫాలో అవుతున్నాడు అని సమాచారం. ఒక్కో షెడ్యూల్ కి ఒక్కో డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నాడట. కొన్నిసార్లు పూర్తిగా కూరగాయలతో అడ్జస్ట్ అయితే మరికొన్నిసార్లు లిక్విడ్స్ మీదే గడిపేస్తున్నారట అల్లు అర్జున్. ఉదయాన్నే రాగి జావా లేదా ఓట్ మిల్క్ షేక్, బౌల్ ఫ్రూట్స్, లేదంటే నట్స్ తింటున్నారట. లంచ్ టైంలో రెండు పుల్కాలు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, లేదా కప్పు పెరుగన్నం, ఈవినింగ్ ఒక కొబ్బరి బొండం, డిన్నర్ లో ఓన్లీ సలాడ్ లేదా సూప్ తో కానిచ్చేస్తున్నారట.

ఇంత కష్టం ఎందుకంటే?

మరి ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకు ఇంతగా కడుపు కాల్చుకుంటున్నారు? అంటే… ఈ సినిమాలో అల్లు అర్జున్ కొన్నాళ్లు కనిపించకుండా పోయే అవకాశం ఉన్నట్టు టీజర్ ద్వారా వెల్లడించారు. సినిమాలోని కొన్ని సీన్లలో అల్లు అర్జున్ సన్నగా కనిపించాల్సిన రావొచ్చు. అలా సన్నివేశాలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడానికి అల్లు అర్జున్ స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఎలాగైనా సరే ఆగస్టు 15నే ఈ మూవీని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం అంతా తెగ కష్టపడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సినిమాను షూట్ చేస్తున్నారు. కానీ మరోవైపు సెట్లలో షూటింగ్ సీన్స్ లీక్ అవుతూ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్ గా రష్మిక మందన్న రెడ్ సారీ కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు