Balakrishna: సైకో గాడు.. తిరిగి కొడితే ఏంటి పరిస్థితి… బాలయ్యపై డైరెక్టర్ సీరియస్

Balakrishna : టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అటు రాజకీయాల పరంగా ఇటు సినిమాల పరంగా అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు.. అయితే బాలకృష్ణ మీద ఎప్పుడూ కూడా ఏదో రకంగా ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా ఆయన మాట్లాడే మాటలు చాలా వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఎవరికి కూడా అర్థం కాకుండా ఒక్కొక్కసారి ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.. ఇప్పుడు తాజాగా ఒక స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ ను సైకో అనడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. మరి అంది ఏ డైరెక్టర్? ఎందుకోసం అన్నారో ఒకసారి చూద్దాం.

బాలయ్య పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

కోలీవుడ్ లో నటుడుగా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన కేఎస్ రవికుమార్.. కమలహాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకున్నారు. బాలయ్యతో కూడా ఎన్నో సినిమాలను చేశారు ఈ డైరెక్టర్. బాలయ్య సైకో లా సినిమా షూటింగ్లలో మారుతాడని.. దీంతో తీవ్రమైన అసహనాన్ని కూడా తెలియజేశారు. గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన వల్ల బాలకృష్ణ మీద గౌరవం కూడా పోయింది అంటూ తెలియజేశారు.

బాలయ్య సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశా..

కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. సాగర సంగమం సినిమా తమకు మంచి విజయాన్ని అందించింది..
ఆ తర్వాత తెలుగులో మరో హీరోతో సినిమా చేయాలనుకుంటున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు అబ్బాయి బాలకృష్ణ తో ఒక సినిమా చేయడానికి డైరెక్టర్ కె విశ్వనాథ్ ను అడిగారట.. అందుకోసం టైటిల్ కూడా జనని జన్మభూమి అని అనౌన్స్మెంట్ చేసి బాలయ్యను హీరోగా ఈ సినిమా చేశారు. అయితే ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేశానని తెలిపారు. అప్పుడే బాలయ్య తో మొదటిసారిగా తనకు పరిచయం అయ్యిందని.. ఈ సినిమా షూటింగ్ విశేషమేమిటంటే తన ఊరికి దగ్గరలోనే జరిగిందని రవికుమార్ వెల్లడించారు.

- Advertisement -

అభిమానులతో సైకోల ప్రవర్తిస్తాడు..

అప్పుడు యంగ్ గా ఉన్న బాలయ్య చాలా సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడే వారని.. అలా రాను రాను ఒక్కసారిగా సైకో లా బాలయ్య మారాడని తెలిపారు. జనని జన్మభూమి సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమానిపైన చేయి చేసుకున్నారని.. కొంతమంది అభిమానులు బాలయ్యను కలవడానికి రాగా ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిలుచొని ఫోటోలు దిగుతున్న సమయంలో అనుకోకుండా బాలయ్య భుజం మీద ఒక అభిమాని చెయ్యి వేసారని.. దీంతో ఒక్కసారిగా బాలయ్య కు కోపం వచ్చి తీవ్రంగా ఆ అభిమానిని చితకబాదాడని తెలిపారు.

తిరిగి కొడితే బాలయ్య పరిస్థితి ఏంటి..

ఈ సంఘటన చూసి బాలయ్య మీద ఉండే ప్రేమ తనకు విరిగిపోయిందని.. ఆ సమయంలో బాలయ్య సైకో.. సంస్కారం లేని వ్యక్తిగా కనిపించారని అలాంటి వ్యక్తి తనని కొట్టినా కూడా తన పరువు పోతుందనే విధంగా తన మనసులో ఒక అసహనం మొదలయ్యిందని తెలిపారు కేఎస్ రవికుమార్. అంతేకాదు తిరిగి కొడితే ఆయన పరిస్థితి ఏమవుతుందని కూడా ఆయన ఆలోచించరు అంటూ డైరెక్టర్ కామెంట్లు చేశారు. అయితే చివరికి తన అసిస్టెంట్ నవ్వాడని కూడా బాలయ్య కొట్టబోతే తానే అడ్డుపడ్డాను అని కూడా తెలిపారు రవికుమార్.. ప్రస్తుతం కేఎస్ రవికుమార్ చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు