Keerthy Suresh : అక్కడ తొలి సినిమాకే హద్దులు చేరిపేసిన కీర్తి..

Keerthy Suresh : టాలీవుడ్ లో ఈ తరం మహానటిగా పాపులర్ అయిన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహానటి సావిత్రి బయోపిక్ తో సౌత్ మొత్తం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకోవడమే గాకుండా ఏకంగా నేషనల్ అవార్డుని సైతం సొంతం చేసుకుని సెన్సేషన్ అయింది. అయితే గత కొంత కాలంగా మాత్రం ఈ అమ్మడు వరుస ప్లాపులను ఎదుర్కొంటుంది. ఏ భాషలో చేసినా సినిమాలు అంతగా కలిసిరావడం లేదు. రొటీన్ స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకోవడం ఒక కారణం అయితే, తనకంటూ నటిగా లిమిటేషన్స్ పెట్టుకోవడం మరో కారణం అని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కీర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆ విషయం కంఫర్మ్ అయి ఏడాది కాగా, అక్కడ తాను చేస్తున్న సినిమాల నుండి లీక్ అవుతున్న స్టిల్స్ చూస్తే మాత్రం తను కీర్తియేనా అన్న సందేహం వచ్చేలా ఉంది. అసలు విషయానికి వస్తే.. సౌత్ లో ఎంత టాప్ హీరోయిన్ గా ఉన్నా సరే కొందరు భామలు గ్లామర్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు.

సౌత్ లో కండిషన్స్ అప్లై..

అయితే మిగతా హీరోయిన్స్ ఎంత రెచ్చిపోయి గ్లామర్ షో చేసినా, కొందరు హీరోయిన్లు మాత్రం తమకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా గ్లామర్ విషయంలో కండీషన్స్ పెడుతుంటారు. కేవలం అభినయంతోనే ఆడియన్స్ ను మెప్పించాలనే ఆలోచనతో కొందరు కథానాయికలు ఉంటే, ఎలాగైనా ప్రేక్షకుల మెప్పు పొందాలనే ఆలోచన మరికొందరికి ఉంటుంది. అయితే సౌత్ సినిమాల్లో కేవలం తమ యాక్టింగ్ తోనే మెప్పించి నార్త్ సైడ్ వెళ్లగానే గ్లామర్ షో చేస్తున్న హీరోయిన్స్ కొందరు ఉంటారు. సౌత్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్స్ కూడా బాలీవుడ్ నీళ్లు పడగానే గ్లామర్ గేట్లు ఎత్తేస్తారు. ఇక్కడ నుంచి బాలీవుడ్ వెళ్లిన చాలామంది హీరోయిన్స్ ఇదే బాట కొనసాగించగా, లేటెస్ట్ గా అదే దారిలో కీర్తి సురేష్ వెళ్తుంది అనిపిస్తుంది. మలయాళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకోగా, ఈ మధ్య గ్లామర్ షో చేయడానికి కూడా రెడీ అయింది.

నార్త్ లో గ్లామర్ షో కి రెడీ..

ఇక కీర్తి సురేష్ (Keerthy Suresh) రీసెంట్ గా వరుస ప్లాపులు అందుకున్నా, సౌత్ లో స్టార్ క్రేజ్ తోనే బాలీవుడ్ ఆఫర్ అందుకుంది. ఇక కీర్తి సురేష్ తాజాగా వరుణ్ ధావన్ తో ‘బేబీ జాన్’ సినిమాలో నటించింది. కలీస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముందు ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నా ఇప్పుడు అది మే ఎండింగ్ కు వెళ్లింది. తాజాగా బేబీ జాన్ ప్రోమోలు రిలీజ్ కాగా అందులో కీర్తి సురేష్ గ్లామర్ ట్రీట్ చూసి సౌత్ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. బాలీవుడ్ వెళ్లగానే కీర్తి సురేష్ కూడా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిందని, తనకున్న హద్దులు పూర్తిగా చెరిపేసిందని అంటున్నారు. లేటెస్ట్ గా బేబీ జాన్ సినిమాలోని ఒక సాంగ్ లో కీర్తి సురేష్ లుక్ ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తుంది. ఇన్నాళ్లు సౌత్ లో క్లీన్ సర్టిఫికెట్ తో మెప్పించిన కీర్తి సురేష్ బాలీవుడ్ వెళ్లగానే ఇలా స్కిన్ షోతో రెచ్చిపోతుందని అంటున్నారు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే ఆమె లోని ఈ ట్రాన్స్ ఫర్మేషన్ కి ఖుషి అవుతున్నారు. బేబీ జాన్ హిట్ అయితే మాత్రం కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. కానీ అక్కడ ఎన్ని ఆఫర్లు వచ్చినా సౌత్ లో వచ్చినంత పేరు గాని, క్రేజ్ గాని రాదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు