Satya Prakash : ‘చిరు’ కొనిచ్చిన కారు 30 ఏళ్లుగా అలాగే ఉంది..

Satya Prakash : ప్రముఖ టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, విలన్ స‌త్యప్రకాశ్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప్ర‌తి నాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును క‌లిగిన న‌టుడు. పోలీస్ స్టోరీ లాంటి సినిమా స‌త్య‌ప్ర‌కాష్ కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తీసుకొచ్చింది. అలాగే బిగ్ బాస్, మాస్టర్, సీతారామరాజు, పోకిరి వంటి సినిమాలతో ప్రత్యేకమైన విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మంచి పత్రాలు చేస్తూ దాదాపు మూడు ద‌శాబ్ధాలుగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కి సేవ‌లందిస్తున్నారు. 1991 లో `జైత్ర‌యాత్ర‌`తో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ద‌ర్శ‌క, నిర్మాతలు బాలీవుడ్ విల‌న్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో స‌త్య‌ప్ర‌కాష్ లాంటి సీనియ‌ర్ల‌కు అవ‌కాశాలు త‌గ్గాయి. అయితే అవ‌కాశం ఇస్తే వాళ్ల‌ను మించిన గొప్ప న‌టుడని సత్యప్రకాష్ ఎప్పుడో ప్రూవ్ చేసాడు. అవ‌కాశిలిస్తే ఇప్పుడు కూడా స‌త్తా చాట‌గ‌ల నటుడు. ఇక అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో త‌న‌కున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు సత్యప్రకాష్.

చిరు తో అనుబంధం..

ఇక తాజాగా నటుడు సత్య ప్రకాష్ (Satya Prakash) ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన కెరీర్ బిగినింగ్ డేస్ గురించి మాట్లాడాడు. ఆ నేపథ్యంలో చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు. `నేను పుట్టింది విజయనగరంలో, ఎప్పట్నించొ నుంచి నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. ఆయ‌న‌తో క‌లిసి మొద‌టిసారి బిగ్ బాస్ సినిమా లో చేసాను. ఆ సినిమా సెట్లోనే నాకు నేనుగా చిరంజీవిగారిని పరిచయం చేసుకున్నాను. వారం రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాను. చిరంజీవి గారి కాంబినేషన్లో ఫైట్స్ చేసేటప్పుడు, నా విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవారని అన్నాడు. నాకు దెబ్బలు తగలకుండా ఆయన కేర్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే నేను షూటింగ్ కి పాత స్కూట‌ర్ పై రావ‌డం, వెళ్ల‌డం చూసేవారు. ఆ స‌మ‌యంలోనే హెల్మెట్ లేకుండా స్కూటర్ నడపడం ప్రమాదమని హెచ్చరించారు. అప్పుడే నాకు కారు కొనిపెడతానని అన్నారు. అన్న‌ట్లుగానే మారుతి కారు కొనిచ్చారు. ఆ తరువాత చాలా కార్లు మార్చాను గానీ, మెగాస్టార్ కొనిచ్చిన కారు ఇప్పటికీ అలాగే ఉందని, ఆ జ్ఞాప‌కం ఎప్ప‌టికీ చెరిగిపోనిది’ అని అన్నారు.

చిన్న సినిమాల్లో నటిస్తూ బిజీ..

అయితే టాలీవుడ్ లో అద్భుతమైన విలనిజం పండించే నటుల్లో ఒకరైన సత్య ప్రకాష్ ఈ మధ్య కొత్త విలన్ల ఎంట్రీ వల్ల స్లో అయ్యారు. కానీ అవకాశమొస్తే వాళ్ళకంటే తామే అన్ని రకాలుగా బాగా నటించి మెప్పించగలమని అన్నాడు. ఇక స‌త్య ప్ర‌కాష్ గ‌త ఏడాది రిలీజ్ అయిన మ‌సూద‌లో కీల‌క పాత్ర‌లో మెప్పించారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజుల్లోనే స‌త్య‌ప్ర‌కాష్ చిరు తోనే కాదు బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో విల‌న్ గాను కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఇక ఈ జెనరేషన్ లో అందరికి గుర్తుండిపోయే పాత్ర అంటే పోకిరి సినిమాలో నారాయణ్ పాత్ర. ఇక సత్య ప్రకాష్ ప్రస్తుతం ఓ రెండు చిన్న సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఎంతో టాలెంట్ ఉన్న ఇలాంటి తెలుగు నటుల్ని దర్శకులు ప్రోత్సహించాలని ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు