Rathnam Twitter Review: విశాల్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..?

Rathnam Twitter Review.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం రత్నం.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఈరోజు అనగా ఏప్రిల్ 26వ తేదీన తమిళనాడుతో పాటు ఆంధ్ర , తెలంగాణలో కూడా విడుదల కానుంది.. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ లో సినిమా షోస్ పడగా ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.. ఇక ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. రత్నం మూవీని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు.

Rathnam Twitter Review:Did Vishal hittrick..?
Rathnam Twitter Review:Did Vishal hittrick..?

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు , టీజర్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన ఎటువైపు అనే పాట శ్రోతలను మెప్పించడమే కాదు విశాల్ కు హిట్ అందించడానికి సిద్ధమైందనే వార్తలు కూడా వినిపించాయి.. దేవిశ్రీప్రసాద్ – విశాల్ కాంబోలో రత్నం సినిమా మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు..

యూఏ సర్టిఫికెట్..

విశాల్ – హరి కాంబో లో వచ్చిన ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇక ఈ సినిమాలో యాక్షన్ తో పాటు చక్కని సందేశం ఉందని కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా అంటూ సెన్సార్ సభ్యులు కూడా తెలిపారు..

- Advertisement -

ట్విట్టర్ రివ్యూ..

ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే పడిన పలు ప్రీమియర్ షో లు చూసిన రత్నం సినిమాపై స్పందిస్తూ ఈ విధంగా రివ్యూ ఇవ్వడం జరిగింది..

షో టైం రత్నం.. విశాల్ నుంచి బ్లాక్ బస్టర్ కం బ్యాక్ రత్నం అంటూ ఒక యూజర్ ట్వీట్ చేశారు.. అందులో థియేటర్ లోని విజువల్స్ వీడియోని కూడా షేర్ చేస్తూ .. ఆ వీడియోలు తనకు బాగా నచ్చాయని కూడా స్పష్టం చేశారు.. ముఖ్యంగా ఇందులో పాటలు చాలా సూపర్ గా ఉన్నాయని.. ఎమోషన్స్ అదిరిపోయాయని.. స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకుందని.. మొత్తం సినిమాలో స్క్రీన్ ప్లే వందకి 100 శాతం బెస్ట్ అనిపించిందని తెలిపారు.. రత్నం సినిమా సూపర్ హిట్ అంటూ ఒక నెటిజన్
రాసుకొచ్చారు..

ఇక మరొక యూజర్ విషయానికి వస్తే.. విశాల్ – హరి యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం ఇవాల్టి నుంచి థియేటర్లోకి రానుంది.. మంచి ఇంటర్వ్యూలు..గ్రౌండ్ నుంచి సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించారు.. అంటూ సినిమాపై ట్వీట్ చేశారు..ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉందని నెటిజన్లు కూడా రివ్యూలు ఇస్తున్నారు. విశాల్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాకి ప్లస్ పాయింట్స్..

విశాల్ నటన అదిరిపోయింది.. ఫస్ట్ ఆఫ్ లో విశాల్ ఇంట్రో సీన్, ప్రియా భవాని శంకర్ – విశాల్ మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాకి ప్లస్ కానున్నాయి.. అలాగే గౌతమ్ మీనన్ , సముద్రఖని, మురళీ శర్మ, యోగి బాబు కూడా తమ పాత్రలలో జీవించేశారు అంటూ రివ్యూలు వినిపిస్తూ ఉండడం..

సినిమాకి మైనస్ పాయింట్స్..

విశాల్ – ప్రియా భవాని మధ్య లవ్ ట్రాక్ లో డెప్త్ కంటే సినిమాటిక్ టోన్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.. రత్నం సినిమా మొదలైనప్పటి నుంచి విశాల్ అభిమానులు విజిల్స్, కేకలతో ఊగిపోయేంత అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదని తెలుస్తోంది ..రత్నం కథలో కంటెంట్ ఆ రేంజ్ లో లేకపోవడమే దీనికి కారణం..

మొత్తానికి భారీ యాక్షన్ సినిమాగా వచ్చిన రత్నం ఒక సిల్లీ డ్రామా అయిపోయిందని కొంతమంది చెబుతున్నారు .. అయితే విశాల్ అభిమానులకు నచ్చేలా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని రివ్యూలు ఇస్తున్నారు.. పూర్తిస్థాయిలో అయితే ఆకట్టుకోవడం కష్టం మరి హ్యాట్రిక్ కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు