Eagai: సీతమ్మ హాఫ్ సెంచరీ కొట్టేసింది!

టాలీవుడ్ లో సీత గా పాపులర్ అయిన తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళుతుంది. అప్పుడెప్పుడో 2006 లో “ఫోటో” అనే చిన్న సినిమాతో పరిచయమైన ఈ భామ టాలీవుడ్ లో అవకాశాలు రాక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ‘కట్రాద్ తమీజ్’ అనే సినిమా చేయగా మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టడంతో అవకాశాలు వెల్లువెత్తాయి. అలా అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. అయితే తన టాలెంట్ చూసి దిల్ రాజు పిలిచి మరీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె” చెట్టు చిత్రంలో మెయిన్ లీడ్ గా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయినా అంజలికి ఎక్కువగా తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయినా సౌత్ మొత్తం ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సినిమాలు చేస్తూ బిజీ అయింది.

రీసెంట్ గా అంజలి రేర్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ మధ్యే తమిళ్ లో “ఈగై” అనే సినిమాలో హీరొయిన్ గా నటించే అవకాశం పొందింది. ఈ సినిమా ద్వారా అంజలి హీరోయిన్ గా 50 సినిమాలు పూర్తి చేసుకోనుండడం విశేషం. అంతే కాక అంజలి నటిస్తున్న ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రం కావడం, అందులోను తనే మెయిన్ లీడ్ గా నటించనుండడం విశేషం.

ఇక అంజలి తన 25వ సినిమా తెలుగులో చేసిన గీతాంజలి కావడం మరో విశేషం. ఈ సినిమాలో కూడా తనే మెయిన్ లీడ్ గా నటించింది. ప్రస్తుతం అంజలి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తికాగానే తన 50వ సినిమా షూట్ లో పాల్గొంటుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు