Kushi: ఇది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్.. తల్లిగా మారిన సమంత..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది సమంత. ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కి పెద్ద షాక్ తగిలింది. ఇక త్వరలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సమంత. అయితే ఇదే కాకుండా సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇంగ్లీష్ వర్షన్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రలో సమంత నటిస్తుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించిన హాలీవుడ్ మొదటి సీజన్ ఇప్పటికే విడుదలైంది. ఈ సిరీస్ కి విపరీతమైన రెస్పాన్స్ సైతం వచ్చింది. అయితే ఇండియన్ వెర్షన్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. చాలామంది ఇండియన్ వర్షన్ కి హాలీవుడ్ వర్షన్ అని అనుకున్నారు. కానీ హిందీ సిటాడిల్ ఇంగ్లీష్ వర్షన్ కి రీమేక్ కాదట.. ఫ్రీక్వెల్ అంట.

- Advertisement -

అంటే ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా సమంత, వరుణ్ ధావన్ కనిపించబోతున్నారు. అంటే సమంత అప్పుడే తల్లి పాత్రలు చేస్తుంది. అది కూడా ప్రియాంక చోప్రాకు. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు