NBK108: వన్నె తరగని అందంతో ఇప్పటికీ ఆకర్షిస్తున్న మిత్రవింద

లక్ష్మి కళ్యాణం ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యి చందమామ తో గుర్తింపు తెచ్చుకొని మగధీర లో మిత్రవిందగా అలరించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్లపాటు నెంబర్ వన్ గా ఏలిన తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతోనూ చేసిన ఏకైక హీరోయిన్ కాజల్ కావడం విశేషం. వరుస సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ హీరోయిన్ అయిన కాజల్ 2020 లో ఫ్యాన్స్ కి గట్టి షాక్ ఇచ్చింది.

అప్పటివరకు సజావుగా సాగుతున్న సమయంలో మొదటి లాక్ డౌన్ ముగియగానే సడన్ గా పెళ్లి చేసుకుని అభిమానులతో పాటు ఇండస్ట్రీని ఆశర్యపోయేలా చేసింది. ముంబై కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న కాజల్ 2022 లో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే సినిమాలపై ఇష్టంతో బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ మూవీస్ చేయడం స్టార్ట్ చేసింది. 2022 లో ఘోస్టి అనే తమిళ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ మెల్లిమెల్లిగా అవకాశాలు చేజిక్కించుకుంటుంది.

అయితే పెళ్ళై రెండేళ్లవుతున్నా, ఓ బిడ్డకు తల్లి కూడా అయిన కాజల్ తన పేస్ లో గ్లో కోల్పోకుండా జాగ్రత్త తీసుకుంది. బాడీ షేప్ మారిపోకుండా ఎప్పటికప్పుడు ఎక్ససైజ్ లు చేస్తూ మేయిన్ టైన్ చేసింది. ఫలితంగా ఇప్పటి హీరోయిన్లతో సమానంగా తన గ్లామర్ తో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న NBK108 లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదేగాక తమిళ్ లో ఇండియన్ 2 లో కూడా తనే హీరోయిన్. సీనియర్ హీరోలందరికీ బెస్ట్ ఆప్షన్ గా మారిన కాజల్ యంగ్ హీరోలతో కూడా అవకాశలకోసం ఎదురు చూస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు