Rakul Preeth singh : మూడేళ్లయింది.. ఇక గుడ్ బై చెప్పినట్టేనా?

టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామ, వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ , మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. తనదైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ భామ బాలీవుడ్ పై మోజుతో ఆ ఇండస్ట్రీ కి వెళ్ళింది. ఇక అక్కడ కూడా ముందు వరుస సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ లోనూ తన హవా చాటింది. అయితే ఆ తర్వాత సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడంతో డల్ అయింది.

పెళ్లితో మరింత దూరం..
అయితే తెలుగులో మాత్రం సినిమా చేసి మూడేళ్లయింది. మూడేళ్ళ కిందట కొండపోలం లో నటించిన రకుల్ టాలీవుడ్ కి ఆల్మోస్ట్ గుడ్ బై చెప్ప్పెసినట్టే అనుకోవచ్చు. అయితే స్టార్ హీరోల సినిమాల్లో అయితే ఇప్పుడు రకుల్ కి ఆఫర్లు రావనే చెప్పాలి. అయితే రకుల్ ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా దర్శకులు మాత్రం పట్టించుకోవట్లేదని టాక్. ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ హీరో, ప్రొడ్యూసర్ అయినటువంటి జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గోవాలో కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకి ఎండ్ కార్డు ఇవ్వబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. పైగా పెళ్లి తర్వాత రకుల్ కొత్ ప్రాజెక్ట్ లు ఏమి ఒకే చేయలేదు. పెళ్ళికి ముందే సెట్స్ పై ఉన్న సినిమాలే పూర్తి చేస్తుందని సమాచారం.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ నిజానికి ఆఫర్లు లేకే ఇలా చేస్తుందని ట్రేడ్ విశ్లేషకుల సమాచారం. స్టార్ హీరోల సినిమాల నుండి ఎలాగూ ఆఫర్లు రావడం లేదు. అలాగే రకుల్ ప్రీత్ చేస్తున్న సినిమాల్లో కూడా తన పాత్రలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండడం లేదు. అందువల్ల తన పాతలకు మినిమం ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ వస్తే మాత్రమే చేయాలనీ చూస్తున్నట్టు తెలుస్తుంది. అలా లేకపోతే సినిమాలకి పూర్తిగా దూరంగా ఉండాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి రకుల్ సౌత్ పై మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తుంది. తన ఫోకస్ బాలీవుడ్ లోనే ఉంది. కానీ రకుల్ చేతిలో రెండు మూడు సినిమాలు తప్ప మరేవీ లేవని సమాచారం. ఇదంతా పక్కన బెడితే సోషల్ మీడియా లో మాత్రం తన ఫోటోషూట్లతో సందడి చేస్తుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు