Razakar : పాజిటివ్ టాక్ వచ్చినా.. వీకెండ్ లో తేలిపోయింది..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కాస్త మంచి అంచనాలతో రిలీజ్ అయిన సినిమా రజాకార్. ఈ సినిమా తెలంగాణ నిజాం కాలానికి చెందిన రజాకార్ల అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియన్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. పైగా రిలీజ్ చేసిన టీజర్, గాని ట్రైలర్ గాని మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఈ సినిమాలో టెక్నికల్ గా విజువల్స్ పరంగా కొన్ని లోపాలున్నాయన్న మాట తప్పితే కంటెంట్ పరంగా మంచి కథాంశం తో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే జనాల్ని మెప్పించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే రజాకార్ మార్చి 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక అనుకున్నట్టుగానే క్రిటిక్స్ నుండి మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకుల్ని రప్పించలేకపోయింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి.

మార్కెటింగ్ ప్రమోషన్ లోపం..

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా బడ్జెట్ పరంగా పెద్ద సినిమా అయిన రజాకార్ ఆడియన్స్ నుండి ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం ఏమాత్రం రాలేదు. ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం పెద్ద మైనస్ అయితే, రజాకార్ సినిమాకి అసలు మార్కెటింగ్ చేయకపోవడం, టెలివిజన్ లో గాని, సెలెబ్రిటీలతో కానీ సరైన ప్రమోషన్లు చేయకపోవడం మైనస్ అయిందని చెప్పొచ్చు. మేకర్స్ వారి వరకు సినిమాని ప్రమోట్ చేసినా, దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడంలో విఫలం అయ్యారు. ఏది ఏమైనా మౌత్ టాక్ బాగానే ఉన్నా, పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

- Advertisement -

వీకెండ్ కలెక్షన్స్ దారుణం..

ఇక రజాకార్ ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా, వీకెండ్ లో ఉన్నంతలో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూసుకుంటే ఆల్ మోస్ట్ 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రజాకార్ 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ సినిమా కి సొంతం అవ్వగా వర్త్ షేర్ అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో ఉంటుందని సమాచారం. మొత్తం మీద సినిమా కి ఇవి డీసెంట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కి బిజినెస్ ఏమి చేయకుండా, మేకర్స్ ఓన్ గానే రిలీజ్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్ కి సినిమా వసూళ్లకు పొంతన లేదని చెప్పాలి. అయితే పెద్దగా స్టార్ కాస్ట్ ఏమి లేక పోయినా కూడా ఉన్నంతలో సినిమా మంచి జోరునే చూపిస్తుందని చెప్పాలి. ఇక రజాకార్ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఓ మోస్తరు కలెక్షన్లు రాబడుతుందని చెప్పొచ్చు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు