Hanuman movie OTT Review: ‘హనుమాన్’ మూవీ (ఓటీటీ) రివ్యూ

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా “హనుమాన్”. పోటీగా గుంటూరు కారం లాంటి భారీ చిత్రాలను ఎదుర్కొని కూడా ఆ సినిమాని మించి కలెక్షన్లను కొల్లగొట్టిన హనుమాన్ తాజాగా జీ 5 ఓటిటి లో రిలీజ్ అయింది. దాదాపు 65 రోజుల లాంగ్ గ్యాప్ తర్వాత ఓటిటి లో విడుదల అయిన హనుమాన్ ఒక్కసారి ఓటిటి ప్రేక్షకులని, అలాగే థియేటర్లలో చూడని ఆడియన్స్ ని ఓటిటి లో ఎలా మెప్పించిందో అసలు ఈ సినిమా కథేంటో ఒక్కసారి రివ్యూ లో చూద్దాం..

కథ :

హనుమంతు(తేజ సజ్జ) అంజనాద్రి అనే ఊరికి చెందిన కుర్రాడు. అతనొక దొంగ. అందువల్ల అతనికి ఊర్లో చెడ్డ పేరు ఉంటుంది. ఈ కారణంతోనే అతను ప్రేమించే అమ్మాయి మీనాక్షి(అమృత అయ్యర్) కూడా ఇతన్ని పట్టించుకోదు. అయితే ఆమె ప్రమాదంలో ఉన్న టైంలో తేజ సజ్జ కాపాడాలి అనుకుంటాడు. కానీ ఇతను బలహీనుడు. చూడటానికి బక్కగా ఉంటాడు.. కొంచెం కూడా బలం ఉండదు. అయినప్పటికీ తన తెలివితేటలు ఉపయోగించి కాపాడాలి అనుకుంటాడు. ఈ క్రమంలో గాయపడి ఓ నదిలో పడిపోతాడు. అదే టైంలో అతనికి ఒక దివ్యమణి దొరుకుతుంది. దాని వల్ల అతనికి హనుమంతుని శక్తి లభిస్తుంది. దీంతో అతను బలవంతుడు అయిపోతాడు. అయితే అదే టైంలో అతనికి విలన్ వినయ్ రాయ్ వల్ల సమస్యలు కూడా ఏర్పడతాయి. అవేంటి? అసలు సిటీలో ఉండే వినయ్ రాయ్ .. అంజనాద్రిలో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హనుమంతుని ఎందుకు టార్గెట్ చేస్తాడు.? అతని వల్ల హనుమంతు కోల్పోయింది ఏంటి? అనేది మిగిలిన సినిమా.

- Advertisement -

విశ్లేషణ :

‘హను – మాన్’ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. కొన్ని లాజిక్స్ మిస్ అయినా విజువల్స్ మ్యాజిక్ చేశాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సీన్లు ఫస్ట్ హాఫ్ లో చాలానే ఉన్నాయి. కామెడీ కూడా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ గ్రాఫ్ డౌన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ దశలో సినిమా పడిపోయింది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ రోల్ కి సాడ్ ఎండింగ్ ఇచ్చి ముగించడం అనేది.. ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ, అలాగే ప్రీ క్లైమాక్స్ లో సముద్రఖని రోల్ సినిమాని నిలబెట్టింది అని చెప్పాలి. ఆఖరి 20 నిమిషాలు ప్రేక్షకులకి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ సినిమాని అందించినందుకు మెచ్చుకోవాలి. అలా అని ఇది కొత్త కథేమీ కాదు, కాకపోతే ఫస్ట్ హాఫ్ ను దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. సెకండ్ హాఫ్ విషయంలో అతని ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అయితే అక్కడక్కడా అతను లాజిక్స్ కూడా మిస్ చేశాడు. సినిమాకి టైం పీరియడ్ అనేది చెప్పలేదు. అంజనాద్రి అనే ఊరి జనాల చేతుల్లో ఒక్క ఫోన్ కూడా కనిపించదు. సినిమాలో కొన్ని అనవసరమైన స్పూఫ్ సీన్స్ ఉన్నా, ఇవన్నీ ఫోర్స్డ్ గా అనిపించినా.. చిన్న సినిమా కాబట్టి పెద్దగా కంప్లైంట్ చేసేలా ఉండవు.

నటీనటుల విషయానికి వస్తే..

తేజ సజ్జ ఇమేజ్ కి ‘హనుమాన్’ ప్రాజెక్టు ఎక్కువైపోద్ది అని అంతా అనుకున్నారు. కానీ ఈ కథకి ఓ సామాన్యుడు, అందులోనూ బలహీనంగా ఉన్న కుర్రాడు అయితేనే బాగుంటుంది. కాబట్టి తేజ సజ్జ సరిగ్గా సరిపోయాడు అని చెప్పాలి. హీరోయిన్ అమృత అయ్యర్ పాత్ర కూడా కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర అనే చెప్పాలి.ఎంతమంది ఉన్నా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని ఎక్కువ మార్కులు కొట్టేసారు అని చెప్పాలి. కమెడియన్ సత్య కూడా రెండు, మూడు సీన్స్ లో నవ్వించాడు. వెన్నెల కిషోర్, వినయ్ రాయ్..ల పాత్రలు మాత్రం జస్ట్ ఓకే అనిపించే విధంగా మాత్రమే ఉన్నాయి.

చివరిగా చెప్పాలంటే థియేటర్లో ఓ రేంజ్ లో మెప్పించిన హనుమాన్ ఓటిటి లో ఆ రేంజ్ లో కాకపోయినా డీసెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఓటిటి లోనే హనుమాన్ ని ఫస్ట్ టైం చూసిన వారికి బాగా నచ్చుతుంది. అయితే థియేటర్లో చూసిన తర్వాత మళ్ళీ ఓటిటి లో చూస్తే కాస్త స్కిప్ చేయాలి అనిపించేలా అక్కడక్కడా సీన్లు ఉంటాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు