Nithiin : “ఇష్క్” డైరెక్టర్ తో లక్ చెక్ చేసుకోనున్న నితిన్

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాల తర్వాత ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే తనకు ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఇంతకీ నితిన్ ఈ దర్శకుడితో అనుకున్న స్ట్రాటజీ, ఫార్ములా వర్కౌట్ అవుతాయా? అంటే…

“ఇష్క్” కాంబో రిపీట్…
నితిన్ కెరీర్ లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ మూవీ ఇష్క్. అప్పటిదాకా ఆయనకు ఎదురైన ప్లాఫ్ ల పరంపరకు ఈ మూవీ ఫుల్ స్టాప్ పెట్టింది. విక్రమ్ కుమార్ ఈ బ్రీజి లవ్ ఎంటర్టైనర్ తో నితిన్ ను హిట్ ట్రాక్ ఎక్కించాడు. ఆ మూవీలోని సింపుల్ స్టోరీ, పాటలు, నితిన్, నిత్యా మీనన్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి అలాగే ఈ మూవీ విక్రమ్ కుమార్ కెరీర్ ను కూడా మార్చేసిందనే చెప్పాలి. మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలను తెరకెక్కించే అవకాశం విక్రమ్ కుమార్ కు రావడానికి ఇష్క్ మూవీ కూడా ఒక కారణం. “ఇష్క్” తర్వాత నితిన్, విక్రమ్ కుమార్ మ్యాజికల్ కాంబో రిపీట్ కాలేదు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి నితిన్, విక్రమ్ ఓ కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నితిన్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ కొత్త సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండడం విశేషం.

ఆ ఫ్లాఫ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?
ఇష్క్ మూవీకి ముందు నితిన్ వరుస డిజాస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే సమయంలో విక్రమ్ కూడా మాధవన్ తో 13 బి అనే హార్రర్ ఫిలిం తీసి సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత విక్రమ్, నితిన్ కాంబోలో వచ్చిన ఇష్క్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇద్దరికి మంచి అవకాశాల కోసం ట్రాక్ ను ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత ఇద్దరూ వరుసగా ఫ్లాఫులు అందుకున్నారు. 2014 తరువాత అఆ, భీష్మ తర్వాత నితిన్ కెరీర్లో హిట్స్ లేవు. మరోవైపు విక్రమ్ కుమార్ ను కూడా గ్యాంగ్ లీడర్, థాంక్యూ వంటి సినిమాలతో డిజాస్టర్ లు వెంటాడుతున్నాయి. దీంతో వీరిద్దరికి ఇప్పుడు హిట్ అనేది చాలా ముఖ్యం. మరి ఇలాంటి సమయంలో ఫ్లాప్ ప్లస్ ఫ్లాప్=హిట్ అవుతుందనే ఫార్ములాను నమ్మినట్లు ఉన్నాడు నితిన్. అందుకే తాను ఫ్లాఫ్ లో ఉన్నప్పటికీ, మరో డిజాస్టర్ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. మరి నితిన్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

నితిన్ సినిమాల విషయానికొస్తే…
కాగా నితిన్ ఇప్పుడు రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నారు. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో నితిన్ ఈ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మరోవైపు… రీసెంట్ గా ధూత వెబ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం ఈ సిరీస్ సీక్వెల్ తోనే బిజీగా ఉన్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు