Kalki and Pushpa 2 : “పుష్ప 2” రిలీజ్ డేట్ ను కబ్జా చేయబోతున్న “కల్కి”?

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కారణంగా “కల్కి” రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్ నెలకొంది. ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ఈ ఎన్నికల షెడ్యూల్ కారణంగా టాలీవుడ్ లోని బడా సినిమాలపై ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా ఎలక్షన్ డేట్ కి నాలుగు రోజుల ముందే ప్రభాస్ “కల్కి” మూవీ రిలీజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పొలిటికల్ హీట్ నుంచి తప్పించుకోవడానికి “కల్కి” రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంటారని, “పుష్ప 2” రిలీజ్ డేట్ ను ప్రభాస్ టీం కబ్జా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి పుష్పరాజ్ ఈ త్యాగానికి ఒప్పుకుంటాడా? అంటే…

“కల్కి” కోసం “పుష్ప” రాజ్ త్యాగం చేస్తాడా?

ఎన్నికల సమయం కావడంతో ఈ రెండు నెలలు ప్రజలు పార్టీలకు సంబంధించిన ప్రమోషన్ లో తలమునకలై ఉంటారు. ఇలాంటి టైంలో ప్రేక్షకులు థియేటర్లలోకి వస్తారు అనుకోవడం కలలో మాటే. అయితే మరోవైపు కల్కి లాంటి పాన్ వరల్డ్ సినిమాకు టికెట్ హైక్ తెచ్చుకోవడం కూడా అసాధ్యమే. అంతేకాదు ఈ ఎన్నికల సమయం కారణంగా పాన్ ఇండియా మార్కెట్ “కల్కి”కి వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు. ఇలాంటి టైంలో ధైర్యం చేసి కల్కి లాంటి భారీ బడ్జెట్ మూవీని థియేటర్లలోకి తీసుకొస్తే నిర్మాతలు నిండా మునగాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కల్కి రిలీజ్ డేట్ విషయంలో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఇప్పుడు వాయిదా పడితే కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సరైన రిలీజ్ డేట్ ను వెతకడం మేకర్స్ కు కష్టసాధ్యం అవుతుంది. ఇప్పటికే పుష్ప 2, ఓజి వంటి సినిమాలు కల్కి తర్వాత రిలీజ్ కావడానికి డేట్స్ ను లాక్ చేసుకున్నాయి. ఆ తర్వాత దేవర, గేమ్ చేంజర్ లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కల్కి కోసం “పుష్ప”రాజ్ వెనక్కి తగ్గి, తన రిలీజ్ డేట్ ను త్యాగం చేస్తాడని అంటున్నారు. అంటే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 వాయిదా పడబోతుందని, అదే రోజున కల్కి రిలీజ్ కాబోతోందని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విదేశాలలో కూడా ఆగస్టు 15న పుష్పను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి ఈ నేపథ్యంలో పుష్పరాజ్ వెనక్కి తగ్గుతాడా? అనేది అనుమానమే.

- Advertisement -

“కల్కి” ముందున్నది మూడే దారులు…

ఇక కల్కి మూవీ ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మూవీని జనవరి 12న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ గత ఏడాది డిసెంబర్లో సలార్ థియేటర్లలోకి రావడం, సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోటీగా రిలీజ్ అవ్వడం వలన ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు మరోసారి అంటే మే 9న కూడా కల్కి వాయిదా పడే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కల్కి మూవీ రిలీజ్ కు రానున్న రోజుల్లో మూడే దారులు ఉన్నాయి. జూన్, ఆగస్టు లేదా డిసెంబర్ లలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జూన్ లో పెద్ద సినిమాలేవి లేవు. కానీ సమ్మర్ హాలిడేస్ పూర్తయిపోతాయి. ఇక ఆగస్ట్ పై పెద్ద సినిమాలు ఖర్చిఫ్ వేసేసాయి. ఏ మూవీ అయినా వెనక్కి తగ్గితెనే కల్కి రిలీజ్ కు రూట్ క్లియర్ అవుతుంది. ఆ తరువాత డిసెంబర్ మాత్రం ఖాళీగా ఉంది. సలార్ మూవీ డిసెంబర్లోనే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి “కల్కి” టీం నిర్ణయం ఏంటో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు