Family Star : సినిమాలో దిల్ రాజు, రష్మిక మిస్సింగ్… అంతా అతని వల్లేనా?

Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి వీకెండ్ లో దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఉగాది రోజున మాత్రం దుమ్మురేపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న, మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అతిథి పాత్రలు పోషించారు అంటూ గతంలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తీరా చూస్తే థియేటర్లలో వాళ్లు కనిపించలేదు ప్రేక్షకులకు. మరి ఇంతకీ దిల్ రాజు, రష్మిక మూవీలో నుంచి ఎలా మిస్ అయ్యారు? వీళ్ళ ఫుటేజ్ మిస్ అవ్వడం వెనక ఉన్న వ్యక్తి ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్తే…

దిల్ రాజు, రష్మిక మిస్సింగ్… అంతా అతనే చేశాడు

రూమర్లు చక్కర్లు కొట్టినట్టుగానే ఫ్యామిలీ స్టార్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. ముందు అనుకున్న ఆ ప్లాన్ ప్రకారమే షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఫైనల్ అవుట్ పుట్ లో కూడా ఆ సన్నివేశాలు ఉన్నాయట. కానీ థియేటర్లలో మాత్రం వాళ్లకు సంబంధించిన సన్నివేశాలు కనిపించలేదు. మూవీని థియేటర్లలోకి దింపే చివరి నిమిషంలో స్వయంగా దిల్ రాజు మనసు మార్చుకొని విజయ్ దేవరకొండ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆ సన్నివేశాలకు కట్ చెప్పారట. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న దిల్ రాజు, రష్మిక మందన్న సీన్లను డిలీట్ చేశారు. మరి దీనికి కారణం ఏంటో దిల్ రాజుకే తెలియాలి.

దిల్ రాజు తప్పు చేశారా?

నిజానికి రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండకు మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం మూవీలో కనిపించిన ఈ జోడి ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో మరోసారి థియేటర్లలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ రష్మిక మందన్నకు రాలేదు. ఒకవైపు విజయ్ దేవరకొండ వరుస ఫెయిల్యూర్లు చవి చూస్తుంటే, మరోవైపు రష్మిక మందన్న మాత్రం వరుస హిట్లతో ఆయనకు పూర్తి ఆపోజిట్ గా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ రోజుకో వార్త బయటకు వస్తుంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతోంది అని వార్తలు వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఒకవేళ అనుకున్నట్టుగా రష్మిక సీన్స్ ఉండి ఉంటే ఫ్యామిలీ స్టార్ కు ఈ తీవ్రమైన నెగెటివిటీ మధ్య అదొక ప్లస్ పాయింట్ గా మారేది. అలాగే దిల్ రాజు కనీసం ఒక్క ఫ్రేమ్ లో మెరిసినా అది కూడా బోనస్ ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ తమకు సంబంధించిన సన్నివేశాలను డిలీట్ చేసి దిల్ రాజు తప్పు చేశారు అంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఉగాది రోజున ఫ్యామిలీ స్టార్ థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు