Ganesh Master : మాస్టారు కూడా ఎంట్రీ ఇస్తున్నాడు!

Ganesh Master : టాలీవుడ్ హీరోలుగా, నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన వారు దర్శకులు కావడం చూస్తూనే ఉంటాం. ఒక్క దర్శకుడిగానే కాదు 24 క్రాఫ్ట్ లో టాలెంట్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ గాని టెక్నీషియన్స్ గాని వివిధ రంగాల్లో రాణిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొరియోగ్రాఫర్లు దర్శకులుగా ఎంట్రీ ఇస్తూ ఉండటం ట్రెండ్ అవుతుంది. టాలెంట్ ఉన్న వారు ఎవరైనా ఇండస్ట్రీలో నిరూపించుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ ఎంత అన్నది చెప్పడానికి కొలమానం లేదు. ఇక కొందరు వచ్చిన పనితో పాటు మరో పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు సినిమాల్లో అన్ని రంగాల్లో కూడా చేయి వేసినవారు. మూవీ ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ తాము ఇది చేయగలమని సమర్థవంతంగా నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య కొరియో గ్రాఫర్లు డైరెక్టర్లుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో రాఘవ లారెన్స్, ఆ తర్వాత ప్రభు దేవా, అలాగే అమ్మ రాజ శేఖర్, లేటెస్ట్ గా విజయ్ బిన్నీ. వీరందరూ కొరియోగ్రాఫర్లు గా ఎంట్రీ ఇచ్చి సినిమాల్లో దర్శకులు కూడా రాణిస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఇప్పుడు మరో దర్శకుడు కూడా చేరిపోయాడు.

గణేష్ మాస్టర్ డైరెక్టర్ గా…

టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా ఆయన డాన్స్ కంపోజిషన్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ క్రేజ్. జానీ మాస్టర్ కన్నా ముందు పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కంపోజింగ్ చేసింది ఆయనే. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకోగా, పలు టెలివిజన్ డాన్స్ షోలకు కూడా జడ్జ్ గా వ్యవహరించాడు. ఇప్పుడు సినిమాల్లోకి దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. సడెన్ గా ఆయన మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేస్తా అని సోషల్ మీడియా లో రాత్రికి రాత్రే ట్రెండ్ అయిపోయింది. అనుకున్నదే తడవుగా ఏకంగా మూవీ ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇక ఆయన డైరెక్షన్ లో వస్తున్న సినిమా ముహూర్త కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ప్రభాస్ కాజిన్ హీరోగా!

అయితే గణేష్ మాస్టర్(గణేష్ మాస్టర్) దర్శకత్వం వహించబోయే సినిమాలో డార్లింగ్ ప్రభాస్ యొక్క కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి ‘గౌడ్ సాబ్’ అని టైటిల్ పెట్టడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అటెండ్ అయ్యారు. అలాగే కృష్ణం రాజు భార్య కూడా ఈ ఈవెంట్ కి హాజరు కావడం జరిగింది. ఇక ఆల్రెడీ ఈ ఇయర్ సంక్రాంతికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ నా సామిరంగ అంటూ వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక లారెన్స్, ప్రభుదేవా, విజయ్ బిన్నీ దారిలోనే గణేష్ మాస్టర్ కూడా వస్తున్నాడు. ఇక జానీ మాస్టర్ అయితే ఏకంగా హీరోగా మారి సినిమా మొదలు పెట్టాడన్న సంగతి తెలిసిందే. మరి వాళ్ళలా గణేష్ మాస్టర్ డైరెక్టర్ కూడా సక్సెస్ అవుతాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు