Naga Chaitanya : ఆగిపోయిన నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్… అందుకే ఆ డైరెక్టర్ ను పక్కన పెట్టాడా?

Naga Chaitanya : కొంత కాలం నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లను అందుకున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్న నాగ చైతన్య తన రాబోయే సినిమాల కంటెంట్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నెక్స్ట్ మూవీని పక్కన పెట్టేసాడని సమాచారం. నాగ చైతన్యతోనే గతంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆ డైరెక్టర్ మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడని టాక్ నడుస్తోంది. ఇంతకీ నాగచైతన్య రిజెక్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కు బ్రేక్…

అక్కినేని నాగ చైతన్య ఇటీవల కాలంలో చాలామంది డైరెక్టర్స్ ను, వాళ్ళు తెచ్చిన స్క్రిప్ట్ లను రిజెక్ట్ చేశారని సమాచారం. అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో ప్రాజెక్టును కూడా ఆయన తాజాగా పక్కన పెట్టేసారట. మజిలీ మూవీతో తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణతో నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది. అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలు టక్ జగదీష్, ఖుషి సినిమాలు వరుసగా ఒక దాని తర్వాత ఒకటి డిజాస్టర్ కావడంతో చై ఈ డైరెక్టర్ తో మూవీ విషయం గురించి మళ్ళీ ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. నిజానికి శివ నిర్వాణ చాలా కాలం నుంచి నాగ చైతన్య కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. కానీ ఇంతకాలం తన కోసం వెయిట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ కు నాగ చైతన్య తాజాగా నో చెప్పాడని, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం.

ఈ సంఘటనలే సాక్ష్యాలు…

గత కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య తీసుకుంటున్న నిర్ణయాలే శివ నిర్వాణతో ప్రాజెక్ట్ ఆగిపోయింది అనడానికి సాక్ష్యాలుగా మారాయి. రీసెంట్ గా నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ఈ ఏడాది చివరలో స్టార్ట్ కాబోతోంది. ఈ మిస్టిక్ ఎంటర్టైనర్ కి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ మూవీపై దృష్టి పెట్టాడు నాగ చైతన్య. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ మూవీని జీఏ2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే డైరెక్టర్ కార్తీక్ వర్మతో నెక్స్ట్ మూవీ మొదలు పెట్టబోతున్నాడు నాగ చైతన్య. దీంతో ఎంతో కాలంగా నాగ చైతన్య కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ శివ నిర్వాణం మరో కొత్త హీరో కోసం వెతుక్కోవలసిన అవసరం పడింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు