BadeMiyanChoteMiyan : ఎపిక్ డిజాస్టర్.. డబ్బులు రిటర్న్ ఇవ్వాలని బయ్యర్ల డిమాండ్!

BadeMiyanChoteMiyan : బాలీవుడ్ లో రంజాన్ కానుకగా రెండు క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అజయ్ దేవగన్ నటించిన మైదాన్ కాగా, మరొకటి అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్‌ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ ‘బడేమియా చోటేమియా’. ఇక బడే మియా చోటే మియా సినిమాను అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. చాలా రోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న ఈ హీరోలు ఈ మల్టీ స్టారర్ సినిమాతో తమ హిట్ కరువును తీర్చుకుందామని ఆశ పడ్డారు. ఐతే విడుదలకు ముందే చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ సినిమా విడుదలయ్యాక అందరూ ఊహించినట్టే దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది. బడే మియా చోటే మియా పది సినిమాలు కలిపి తీసినట్టు, పాత చింతకాయ పచ్చడి లా అందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలా మార్నింగ్ షోలు పడ్డాయో లేదో, డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. 350కోట్లు భారీగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాలో ప్రతి సీన్ ఎక్కడో చూసినట్టే ఉంటుంది.

80 శాతం భారీ నష్టాలు..

ఇక బడే మియా చోటే మియా సినిమా రంజాన్ రోజున రావడంతో భారీ ఓపెనింగ్స్ అయినా వస్తాయని మేకర్స్ ఆశపడ్డారు. కానీ రొట్ట రొటీన్ ఫార్ములా తో సినిమా రావడంతో మళ్ళీ ఎందుకు దించిందే దించుతున్నారని ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా భారీ షాకిచ్చిన ఈ సినిమా వీకెండ్ లో కేవలం 50 కోట్ల గ్రాస్ ని అందుకోగా, బడే మియా చోటే మియా ( BadeMiyanChoteMiyan) 350 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు అందులో కనీసం పది శాతం కూడా వసూలు చేయకపోవడం షాకే అని చెప్పాలి. ఇక అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఒకటి అని చెప్పాలి. ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా ను ఇండియాలో మేజర్ చెయిన్ లో పెర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ చేశారు. కానీ చాలా మాస్ సెంటర్స్ లో సినిమాను అడ్వాన్స్ తీసుకుని రిలీజ్ చేసినట్లు సమాచారం. అన్ని చోట్లా సినిమాను కొన్న బయ్యర్లకి ఆల్ మోస్ట్ 80% రేంజ్ లో లాస్ లు సొంతం కాబోతుందని సమాచారం.

డబ్బులు రిటర్న్ ఇవ్వాలని బయ్యర్ల డిమాండ్..

ఇక బడే మియా చోటే మియా ఇప్పటివరకు ఇండియా లో కనీసం 100 కోట్ల వసూళ్లను కూడా అందుకోలేదు. దీంతో బయ్యర్లు భారీగా నష్టపోయారు. దాంతో మూవీ మేకర్స్ ని వాళ్ళు అప్రోచ్ అయ్యి సినిమా నష్టాలను ఎంతో కొంత పూడ్చాలని అంటున్నారు. రంజాన్ లాంటి భారీ సీజన్ లో కూడా ఇండియాలో ఈ సినిమా 60 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా వర్త్ షేర్ 30 కోట్ల లోపు మాత్రమే ఉండటం చూస్తే, సినిమా ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో అన్నదానికి నిదర్శనం. ఇక మేకర్స్ కూడా యాక్టర్స్ నుండి ఎంతో కొంత రిఫండ్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నారట. అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక దీనితో పాటే రిలీజ్ అయిన మైదాన్ కూడా డిజాస్టర్ కాగా, తక్కువ బిజినెస్ వల్ల ఈ సినిమా అంత నష్టం రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు