Sapthami Gowda : ఐపీఎస్ కావాల్సిందాన్ని.. ఇప్పుడా ఛాన్స్ లేదు – సప్తమిగౌడ

Sapthami Gowda : కాంతార ఫేమ్ ‘సప్తమి గౌడ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండేళ్ల కింద టాలీవుడ్ లో “కాంతార” అంటూ బ్లాక్ బస్టర్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ లో పాప్ కార్న్ మంకీ టైగర్ అనే చిన్న సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ప్రవేశించిన ఈ అమ్మాయి కాంతార తో రెండ‌వ సినిమాతోనే పాన్ ఇండియా వైడ్ గా ఫేమ‌స్ అయింది. ఆ తర్వాత ది వాక్సిన్ వార్, సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రీసెంట్ గా యువ సినిమాతో ఆడియన్స్ ని పలకరించగా, ఆ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది. ఇక సప్తమి గౌడ ప్ర‌స్తుతం ‘కాంతార’ ప్రీక్వెల్ లో న‌టిస్తోంది. అయితే టాలీవుడ్ లోకి కూడా ఈ ఇయర్ స్ట్రయిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ స‌ర‌స‌న ‘త‌మ్ముడు’ సినిమాలో ఛాన్స్ అందుకుంది సప్తమి గౌడ. ఇదిలా ఉండగా సప్తమి గౌడ తాజాగా తన ఎడ్యుకేషన్ పై ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేసుకుంది.

ఐపీఎస్ కావాల్సినదాన్ని – సప్తమి..

అయితే సప్తమి గౌడ(Sapthami Gowda) తాజాగా యూపీఎస్సీ ఫ‌లితాలు రిలీజ్ అయిన నేప‌థ్యంలో తాను కూడా ఐపీఎస్ కాబోయి హీరోయిన్ ని అయ్యాన‌న్న సంగ‌తి గుర్తు చేసుకుంది. సప్తమి గౌడ సివిల్ ఇంజ‌నీరింగ్ చదివిందన్న సంగతి తెలిసిందే. అయితే సివిల్ ఇంజినీరింగ్ అనంత‌రం యూపీఎస్సీ
పరీక్షలు రాసి ఐపీఎస్ అవ్వాల‌నుకుందిట‌. తనకు పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే చిన్న నాటి నుంచే చాలా ఆస‌క్తట‌. ఇక తన తండ్రి పోలీస్ ఆఫీసర్ కావ‌డంతో అత‌ని స్పూర్తితోనే ఆ రంగంలోకి వెళ్లాల‌నుకుందిట‌. పైగా చ‌దువులో చురుకుత‌నం చూసి ఇంట్లో వాళ్లు కూడా త‌ప్ప‌కుండా సివిల్స్ కి సెల‌క్ట్ అవుతుంద‌ని భావించారుట‌. స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉండేద‌ట‌. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వ‌చ్చి హీరోయిన్ అయ్యానంటోంది. అయితే ‘సివిల్స్ వైపు వెళ్తే ఖచ్చితంగా స‌క్సెస్ అయ్యే దాన్ని అని, కానీ ఇప్పుడా ఛాన్స్ లేదని, చాలా కాన్సంట్రేష‌న్ తో చ‌ద‌వాలి కాబట్టి, ఇప్పుడంత శ్ర‌ద్ద గా చ‌ద‌వ‌లేనని చెప్పుకొచ్చింది. ఇక అనుకోకుండా న‌టిని అయ్యాను కాబ‌ట్టి ఇక‌పై సినిమా రంగంలోనే రాణిస్తానని తెలిపింది.

స్విమ్మింగ్ లో ఛాంపియన్..

ఇక సప్తమి గౌడ చిన్న తనం నుండే మల్టీ టాలెంటెడ్. ఐదేళ్ల వ‌య‌సులోనే క‌ఠిన‌మైన ఈత నేర్చుకుందట. ఆ విద్య‌తో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు కూడా ద‌క్కించుకుంది. ర‌జ‌త‌, కాంస్య‌, బంగారు ప‌త‌కాలు సైతం అందుకుంది. ఇక న‌టిగా 2020 లో ప్రారంభ‌మైన సప్తమి గౌడ తొలి సినిమాతోనే సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు అందుకుంది. ఆ సినిమా చేసిన వెంట‌నే మ‌రో ఛాన్స్ కోసం రెండేళ్లు వెయిట్ చేసింది. అప్పుడే రిష‌బ్ శెట్టి ‘కాంతార‌’ లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో స‌ప్త‌మి పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయింది. ఇక నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్లలో సప్తమి గౌడ కూడా ఒకరు. త్వరలోనే తెలుగులో తమ్ముడు తో పలకరించబోతున్న ఈ భామ టాలీవుడ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు