Prashanth Varma: రూమర్స్ అన్నీ నిజమే..షాక్ లో ఫ్యాన్స్..!

Prashanth Varma.. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చిన్న సినిమాగా హనుమాన్ సినిమాని తెరకెక్కించి.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ముఖ్యంగా ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాదులో విజయోత్సవ వేడుకను నిర్వహించగా ఇందులో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి కచ్చితంగా తను ఒక సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని.. అది తన బాధ్యత అని భావిస్తున్నానని తెలిపారు. ఇకపోతే హనుమాన్ సినిమాతో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ.. కొడితే కుంభస్థలమే అన్నట్టు ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు..

Prashanth Varma:Rumors are all true..Fans in shock..!
Prashanth Varma:Rumors are all true..Fans in shock..!

100 డేస్ హనుమాన్ విశేషాలు..

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, రాకేష్ మాస్టర్ తదితరులు కీలక పాత్రలో నటించి మెప్పించిన చిత్రం హనుమాన్.. సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఈ సినిమాకు పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలై బొక్క బోర్లా పడ్డాయి.. మొత్తానికి అయితే తేజ తన సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే సక్సెస్ ఈవెంట్ లో భాగంగా 20 ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయని అంటూ స్పష్టం చేశారు..

ఆ రూమర్స్ అన్నీ నిజమే..

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఇది ఎన్నో సంవత్సరాల కల.. 20 సంవత్సరాల పాటు నేను ఈ యూనివర్స్ లో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్లు రాబోయే చిత్రాలలో కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా విభీషణుడిగా సముద్రఖని, హనుమంతునిగా తేజ కొనసాగుతారు. అంతేకాదు ఈ యూనివర్సిటీలో చాలామంది కొత్త వారిని కూడా పరిచయం చేయబోతున్నాము.. టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల వారిని కూడా తీసుకుంటాము. ఇక అన్ని టాప్ ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేసుకొని ఈ యూనివర్స్ లో భాగం చేస్తాను… అయితే ఒకే ఒక కోరిక నేను ఎంపిక చేసుకోకుండా నా సినిమా నచ్చి వారే ఈ యూనివర్స్ లో బాగా అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ప్రశాంత్ వర్మ.. అంతేకాదు ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాము.. పీవీసీయూ పై మీరు వింటున్న రూమర్స్ అన్నీ కూడా నిజమే.. కంటెంట్, పాత్ర ,ఎమోషన్ , వీఎఫ్ఎక్స్ అన్నింటిలో కూడా జై హనుమాన్ సినిమా మరో స్థాయిలో ఉంటుంది అంటూ తెలిపారు ప్రశాంత్ వర్మ. మొత్తానికైతే జై హనుమాన్ సినిమాపై వస్తున్న రూమర్స్ అన్నీ నిజమే అంటూ స్పష్టం చేశారు ప్రశాంత్ వర్మ..

- Advertisement -

జై హనుమాన్ లో చిరంజీవి..

ప్రశాంత్ వర్మ ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఈ సినిమా సీక్వెల్లో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు అంటూ వార్తలు రాగా.. చిరంజీవి ఇందులో భాగమయ్యారు అంటూ ప్రశాంత్ వర్మ కూడా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాలో భాగం కానున్నారని చెప్పిన ప్రశాంత్ వర్మ ఎలా ప్లాన్ చేశాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు