Vijay Thalapathy New Movie : తలపతి విజయ్ సినిమా గురించి స్పందించిన వెట్రి మారన్

Vijay Thalapathy New Movie : వెట్రి మారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెట్రి మారన్ తమిళ్ లో చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. వెట్రి మారన్ సినిమాలంటేనే రియాలిటీ కి దగ్గరగా ఉంటాయి. ఆయన లాంటి దర్శకులు ఉండటం అరుదు అని చెప్పొచ్చు. తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు వెట్రి మారన్. దాదాపు 5 సినిమాలకు జాతీయ అవార్డులను కూడా అందుకున్నాడు.

ఇకపోతే శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు తలపతి విజయ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత విజయ్ చేసిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా కూడా మంచి హిట్ అయింది. అయితే తుపాకీ సినిమా ప్రోమోషన్స్ నిమిత్తం విజయ్ తెలుగు ప్రేక్షకుల వద్దకు వచ్చాడు. ఆ తర్వాత విజయ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ విజయ్ మాత్రం తెలుగు ప్రోమోషన్స్ కి రాలేదు.

ఇకపోతే తెలుగు ప్రేక్షకులకి తమిళ్ హీరో తెలుగు హీరో అంటూ బేధాలు ఏమీ ఉండవు. ఒక సినిమా నచ్చింది అని అంటే దానికి బ్రహ్మరథం పడతారు. ఆ హీరో పై మంచి అభిమానం చూపిస్తారు.
తళపతి విజయ్ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. విజయ్ చేసిన సినిమాలు గురించి తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇకపోతే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

- Advertisement -

విజయ్ పాలిటిక్స్ లో ఉన్న కారణంగా సినిమాలకు దూరమవుతారని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నా. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విజయ్ ఇంకా మరి కొంతమంది దర్శకులతో సినిమా చేయనున్నాడు అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. వాటిలో వెట్రి మారన్ సినిమాను కూడా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా ఈ విషయంపై స్పందించాడు దర్శకుడు వెట్రి మారన్. దళపతి విజయ్ తో సినిమా ఎప్పుడు అని అడిగినప్పుడు. ఆ పోస్టర్ ను క్రియేట్ చేసిన వాళ్లను అడగండి. చాలా ఏళ్ల క్రితం విజయ్ గురించి ఒక కథ రాసాను. ఆ కథ ఇప్పుడు అవుతుంది అని నేను అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు వెట్రి మారన్. వెట్రి మారన్ చెప్పిన ఈ మాటలతో అందరికీ విజయ్ తో వెట్రి సినిమా ఉండదనే క్లారిటీ వచ్చేసింది. ఈ వార్త చాలామంది విజయ ఫ్యాన్స్ కి నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 ను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకే రిలీజ్ అయిన పార్ట్ వన్ అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అందుకే పార్ట్ 2 పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు