Dasari Biopic : దాసరి బయోపిక్.. శిష్యులకు చేత కాలేదా..?

Dasari Biopic : సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా నిలిచిన దాసరి నారాయణరావు ఒకవైపు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు చిత్రాలకు పనిచేసి ఎంతో పేరు ఘడించారు.. ఇదిలా ఉండగా ఈయన మరణించిన తర్వాత ఇంత గొప్ప దర్శకుడు సినీ ఇండస్ట్రీకి మళ్ళీ దొరకలేదని చెప్పాలి. ఇక ఈయన జ్ఞాపకార్థం.. ఈయన పుట్టినరోజు సందర్భంగా మే 4వ తేదీన తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక సంఘం డైరెక్టర్స్ డే అని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. దాసరి నారాయణరావు జ్ఞాపకార్థం కోసమే ఈ వేడుకను నిర్వహిస్తూ ఉండగా మునుపెన్నడు లేని విధంగా ఈసారి దాసరి పుట్టినరోజు వేడుకలలో ప్రత్యేక వినోద కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఈ వేదిక వద్ద దర్శక సంఘం యొక్క సంక్షేమం కోసం భారీగా విరాళాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక అందులో భాగంగానే ఇప్పటికే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఏకంగా రూ.35 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు చాలామంది స్టార్ సెలబ్రిటీలు సాంకేతిక నిపుణులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారని సమాచారం.

దాసరి బయోపిక్ తీసేవారే లేరా..

ఇకపోతే ఇప్పటికే ఎంతోమంది గొప్ప వారి బయోపిక్ లు తెరపై కనిపించిన విషయం తెలిసిందే ..అయితే దాసరి నారాయణరావు ఎంతోమంది శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. కానీ ఆయన బయోపిక్ తీయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదనే వార్త వినిపిస్తోంది.. ఇకపోతే దాసరి బర్తడే అంటే కేవలం పండుగ చేసుకొని వెళ్లిపోవడం కాదు.. ఎందరికో పాఠాలు నేర్పించిన ఆయన జీవితం పై బయోపిక్ తెరకెక్కించే ఆలోచన గురువుగారు శిష్యులకు లేదా అంటూ కొంతమంది సూటిగా కూడా ప్రశ్నిస్తున్నారు.. వాస్తవానికి నటుడిగా, దర్శక నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా దాసరి నారాయణరావు బయోపిక్ ను తెరకెక్కించాలని చాలా క్రితమే ప్రకటించారు .. మద్రాస్ లో ఆయన ప్రవేశం..తొలి అడుగులు.. ఎదిగిన వైనం.. అగ్ర దర్శక నిర్మాతగా.. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దగా.. ఇలా ఎన్నో రకాలుగా ఆయన రూపాంతరం చెందిన తీరును తెరపై చూపించడానికి ప్లాన్ చేశారు.

ఈ బయోపిక్ ని ‘ దర్శకరత్న ‘ పేరుతో దవళ సత్యం దర్శకత్వంలో ఇమేజ్ బ్యానర్ పై తాడివాక రమేష్ నిర్మిస్తున్నారు అని కూడా ప్రకటించారు.. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. సాధారణంగా కొన్ని సినిమాలకు బడ్జెట్ కారణంగా సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. అలాంటి చిక్కుల వల్ల ఆగిపోతే దానికి సహకరించడానికి దర్శక సంఘం సహాయ పడవలసి ఉంటుంది.. ఇంతకుముందు దాసరి నారాయణరావు శిష్యుడైన సి.కళ్యాణ్ కూడా దాసరి బయోపిక్ ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రకటన ఘనంగానే ఉన్నా సినిమా మాత్రం తెరకెక్కలేదు.. ఎంతోమంది దర్శకులు దాసరి బయోపిక్ చేస్తాము అని ప్రకటిస్తున్నారే గాని ఒక్కరు కూడా తెరపై చూపించడం లేదు.. దాసరికి ఇండస్ట్రీలో చాలా మంది శిష్యులు ఉన్నారు. వీళ్లంతా తలుచుకుంటే బయోపిక్ తీయడం ఏమంత కష్టం కాదు.. మరెందుకు ఎవరు స్పందించడం లేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

- Advertisement -

దాసరి ప్రయాణం..

150 కి పైగా విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి.. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను, తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులను కూడా అందుకున్నారు.. అలాగే హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించి జాతీయస్థాయిలో పేరు దక్కించుకున్నారు.. ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న ఈయన బయోపిక్ తీయడానికి మాత్రం దర్శకులు వెనుకడుగు వేస్తూ ఉండడం బాధాకరమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు