Prashant Varma: ఊహకందని స్టార్ హీరోస్ తో పని చేయబోతున్న

ఈరోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు మంచి సినిమా అంటూ ఉంది. ఒక సినిమా బాగుంది అంటే అది చిన్నదా పెద్దదాన్ని చూడకుండా అది చిన్న సినిమా అయినా కూడా పెద్ద హిట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో అలా అనిపించుకున్న సినిమా హనుమాన్. ప్రతి ఏడాది సంక్రాంతి కానుక కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకే ఈ కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలు కమర్షియల్ గా థియేటర్ వద్ద హిట్ కాకపోయినా కూడా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూర్చొని చూస్తారు. అలానే ఈ సినిమాలు మంచి టిఆర్పిని సొంతం చేసుకుంటాయి. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉండేవి. ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా అని ఈ సినిమా టీం కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. కానీ ఇది ఒక త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ సినిమా అని థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు అర్థమైంది. ఈ విషయం పదిమందికి చేరేలోపే ఈ సినిమాకి సంబంధించిన నెగటివ్ టాక్ బయటకు వచ్చేసింది. అయినా కూడా మహేష్ బాబు కి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమా ఎట్టకేలకు అద్భుతమైన ఘనవిజయం సాధించింది.

గుంటూరు కారం సినిమాతో పాటుగా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. వాస్తవానికి హనుమాన్ సినిమాకి సంబంధించి థియేటర్స్ కూడా పెద్దగా దొరకలేదు. కానీ సినిమా బాగుండటం వలన మెల్లమెల్లగా థియేటర్స్ దొరుకుతూ వచ్చాయి. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు చిన్న పిల్లలు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. రీసెంట్ గా ఓటీటీ లో వచ్చిన ఈ సినిమా గురించి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని వండర్స్ సృష్టించిందని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా 100 రోజులను పూర్తి చేసుకుంది హనుమాన్ సినిమా. రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా 50 రోజులు 100 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. సాటిలైట్ ఓటిటి అన్ని వచ్చేసిన ఈ తరుణంలో ఒక సినిమా ఇన్ని రోజులు ఆడింది అని అంటే అది గొప్ప విషయం అని చెప్పొచ్చు. మొదటి చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

జై హనుమాన్ సినిమా గురించి ప్రశాంత్ వర్మ నిన్న జరిగిన వంద రోజులు వేడుకలో చెప్పుకొచ్చారు. కేవలం తెలుగు స్టార్ హీరోస్ మాత్రమే కాకుండా మలయాళం లోని స్టార్ హీరోస్, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ వీరందరూ కూడా హనుమాన్ సినిమా చూసి ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో తాము కూడా భాగమవుతామని తమకు తాముగా వచ్చి జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా సంబంధించి కొంత మేరకు స్క్రిప్ట్ లో కూడా చేంజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు