SSMB29: ట్రిపుల్ ఆర్ మాదిరిగానే

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళికి ఫ్యాన్స్ ఉన్నారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు రాజమౌళి. తెలుగు సినిమా సత్తా కూడా చాలామందికి అదే సినిమాతో తెలిసి వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేస్తూ దర్శకుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడ్డాడు. తాను నిలబడటమే కాకుండా తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాడు. రాజమౌళి చాలామందిని స్టార్ హీరోలను చేశాడు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు రాజమౌళితో కలిసి పనిచేశారు. వీరందరికి మంచి స్టార్ట్ డం అందించాడు ఎస్ఎస్ రాజమౌళి.

వాళ్ల కెరియర్లు బిగ్గెస్ట్ హిట్ సినిమాలు అన్నీ కూడా రాజమౌళి అందించినవి అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ సినిమాలను చేశాడు రాజమౌళి ఈ సినిమాలు ఎన్టీఆర్ కెరియర్ లో మంచి ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్ ను ఒక స్టార్ హీరోగా ఈ సినిమాలు నిలబెట్టాయని చెప్పొచ్చు. చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ కి మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది ఆ సినిమా. తన రెండవ సినిమాతోనే అంతటి స్టార్డం రామ్ చరణ్ కి రావడానికి కారణం ఎస్ ఎస్ రాజమౌళి.

- Advertisement -

ఇకపోతే ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాస్ ని ఒక మాస్ కమర్షియల్ స్టార్ హీరోని చేసిన సినిమా అంటే చత్రపతి అని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి ప్రభాస్ కు కొత్త ఫ్యాన్స్ తీసుకొచ్చి పెట్టింది. ఇక మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు ఒక ఐదేళ్లపాటు ఆ సినిమా కోసం కేటాయించాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తారని చెప్పొచ్చు దీనికి కారణం బాహుబలి సినిమా.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు మల్టీ స్టార్లర్లు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటివరకు చాలా మల్టీస్టారర్ సినిమాలు తెలుగులో వచ్చాయి. వాటన్నిటికీ మించిన సినిమా అంటే ట్రిపుల్ ఆర్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ తేజ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్రను సృష్టించింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్కార్ తీసుకొచ్చింది. ఇకపోతే ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ డివివి దానయ్య ఎస్.ఎస్ రాజమౌళి అంతా కూడా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పుడు అదే మాదిరిగా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా గురించి కూడా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ను కండక్ట్ చేసి ఆ ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకొని ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పటినుంచో అనుకుంటున్నారు. మొత్తానికి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది అయితే ఈ సినిమా గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా పూర్తి అవడానికి దాదాపుగా మూడేళ్లు పైన పడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు