Aaditi Pohankar : సౌత్ లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సక్సెస్ అయ్యేనా?

Aaditi Pohankar : “అదితి పొహంకార్”. ఈ పేరు వింటే మూవీ లవర్స్ పెద్దగా గుర్తు పట్టకపోవచ్చుగాని, “షి” వెబ్ సిరీస్ హీరోయిన్ అంటే మాత్రం యిట్టె గుర్తు పడతారు. బాలీవుడ్ లో ఈ భామ తెగ పాపులర్. అంతే కాదు టాలెంటెడ్ నటి కూడా. అన్నిటికి మించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అదితి పొహంకార్ ఒక అథ్లెటిక్ కూడా. ఇక ఈ బాలీవుడ్ లో “షీ”, ఆశ్రమ్ వంటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయిన ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడీ బోల్డ్ బ్యూటీ సంగతి ఎందుకంటారా? త్వరలోనే ఈ భామ సౌత్ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక అసలు విషయానికి వస్తే.. అదితి పొహంకార్ మహారాష్ట్ర కు చెందిన అమ్మాయి కాగా, 1994 డిసెంబరు 31న సుధీర్- శోభా పోహంకర్ దంపతులకు జన్మించింది. ఇక అదితి తల్లిదండ్రులిద్దరూ జాతీయ స్థాయి అథ్లెట్లు కావడం విశేషం. అందుకే ఈ అమ్మాయి కూడా చిన్నతనంలోనే అథ్లెటిక్ విభాగంలో రాణించింది. ఇక మహారాష్ట్ర తరపున స్కూల్ టీమ్ లోనే పలు అవార్డులు కూడా సాధించింది. 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో పతకాలు కూడా సాధించింది. ఇక ఆ తర్వాత అదితి పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన అదితి పదేళ్ల కింద ఓ లై భారీ అనే మరాఠీ చిత్రంతో హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

“షీ” తో పాపులర్..

అయితే అదితి పొహంకార్ (Aaditi Pohankar) హీరోయిన్ గా 2017 లో ఓ తమిళ్ సినిమాలో సైడ్ రోల్ లో నటించింది. కానీ హీరోయిన్ గా కాదని చెప్పాలి. అయితే అదితి కి అసలైన గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం “షి” అనే వెబ్ సిరీస్ అని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఇందులో భూమికా పరదేశి అనే పాత్రలో పోలీస్ కానిస్టేబుల్ గా నటించింది. ఈ రోల్ లో అదితి పవర్ ఫుల్ గా కనిపించడమే కాక, అండర్ కవర్ ఆఫీసర్ గా, వేశ్యల అడ్డా లోకి వెళ్లి క్రిమినల్స్ ని పట్టుకునే పాత్రలో అద్భుతంగా నటించింది. అంతే కాదు పలు బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించింది. ఇక ఆ తర్వాత బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో కూడా అద్భుతంగా నటించింది. ఈ రెండు వెబ్ సిరీస్ లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయడంతో పాటు, గ్లామర్ షో కూడా చేసింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా మాత్రం ఇంకా సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి.

సౌత్ లో లక్ కలిసొస్తుందా?

ఇక అదితి పొహంకార్ హీరోయిన్ గా ఇప్పుడు సౌత్ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ మధ్య తమిళ్ సినిమాలో సైడ్ రోల్ చేసిన అదితి ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న “స్టార్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎలాన్ దర్శకత్వంలో కవిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను SVCC బ్యానర్ REE బ్యానర్స్ కలిసి, భోగవల్లి ప్రసాద్, శ్రీనిధి సాగర్ సంయుక్తంగా నిర్మస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అదితి పొహంకార్ సౌత్ లో పాగా వేస్తుందా లేదా అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు