Krishnam Raju: అతనికి తొలి సినిమా.. ఆమెకు 100వ సినిమా.. కానీ..!

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఏ హీరో కైనా ఏ హీరోయిన్ కైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు వారి తొలి సినిమా జీవితాంతం గుర్తుండిపోతుంది.. అయితే ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ వారు నటించిన తొలి సినిమా హిట్ అయితే వరుసగా అవకాశాలు వస్తాయి .. ఒకవేళ ఫ్లాప్ అయితే అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అందుకే ఎవరైనా సరే తమ తొలి సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు.. సాధారణంగా కొత్త హీరోకి జంటగా.. మరో కొత్త హీరోయిన్ ని మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.. లేదా ఆ హీరో కంటే రెండు మూడు సినిమాలు చేసిన సీనియర్ అయి ఉంటుంది.

అయితే అలా కాకుండా అప్పటికే 100 సినిమాలు పూర్తిచేసి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ తో తమ తొలి సినిమాలో నటించాల్సి వస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అలాంటి అనుభవాన్ని కృష్ణంరాజు అనుభవించారు.. ఆయన తొలి సినిమా గువ్వా గోరింక.. ఈ సినిమాలో అవకాశం కోసం కృష్ణంరాజు దాదాపు రెండు సంవత్సరాలు పాటు కృషి చేశారు. బావమరదళ్ళు చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతోనే మద్రాస్ రైలు ఎక్కిన కృష్ణంరాజు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు దర్శకుడు ప్రత్యగాత్మ అతనికి స్క్రీన్ టెస్ట్ చేసి తాను సొంతంగా నిర్మించే సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానని.. అయితే అంతకుముందు నాటకాలు వేసి అనుభవం పొందాలి అని చెప్పారట…

అప్పటివరకు నటనలో ప్రవేశం లేదు ..నాటకాలు వేసిన అనుభవము లేదు కాబట్టి తాను సినిమా చేయడానికి సమయం పడుతుందని.. అప్పటివరకు నాటకాలు వేసి అనుభవం సంపాదిస్తే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట ప్రత్యగాత్మ. ఇక ఈయన చెప్పినట్టుగానే నాటకాలు వేస్తూ మంచి అనుభవం పొందారు. అప్పుడప్పుడు షూటింగ్ లకి వెళ్తూ.. కెమెరా ముందు ఎలా నటించాలి అన్న విషయాల్లో కూడా మెలుకువలు తెలుసుకున్నారు. ఇక 1965 ఆగస్టు 6న ప్రత్యగాత్మ తన కొత్త సినిమా గువ్వా గోరింకను ప్రారంభించారు.. ఇందులో కృష్ణంరాజు హీరో అయితే కృష్ణకుమారి హీరోయిన్.. ఈ కాంబినేషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -

ఎందుకంటే అప్పటికే కృష్ణకుమారి 100 సినిమాలు చేసిన పూర్తి అనుభవం.. అంతకుముందు ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాలలో కృష్ణకుమారి హీరోయిన్ గా నటించింది.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆయన పైన నమ్మకంతోనే గువ్వ గోరింక సినిమాకి కొత్త హీరో అని తెలిసినప్పటికీ కూడా ఆమె చేయడానికి అంగీకరించింది. అయితే తన తొలి సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణంరాజుకు మాత్రం ఈ సినిమా నిరాశ మిగిల్చిందని చెప్పాలి.. ఈ సినిమాలో వ్యాపారాత్మక ధోరణి, కళాత్మక ధోరణి రెండూ ఉండడం వల్లే ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.. అయితే ఉత్తమ ద్వితీయ చిత్రంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకుంది.. ఈ సినిమా అలా కృష్ణంరాజుకు మొదటి సినిమా అయినా కృష్ణకుమారి కి మాత్రం 100వ సినిమా.. భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలింది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు