Relationship Tips : అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తే అబ్బాయిలను అట్రాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నట్టే

అమ్మాయిల మనసు తెలుసుకోవడం చాలా కష్టం అని అంటూ ఉంటారు అబ్బాయిలు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనేది అబ్బాయిల ఆలోచన. అవునంటే కాదని, కాదంటే అవును అని అన్నట్టేనని పలు సినిమాల్లో ఇప్పటికే చూశాము. సాంగ్స్ ద్వారా విన్నాము. అయితే నిజం ఏంటంటే అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు. వాళ్లు తమ ఇష్టా ఇష్టాలను చిన్నచిన్న విషయాల ద్వారానే వెల్లడిస్తారు. ఈ విషయాలను గమనించకపోతే వాళ్ళు కేవలం స్నేహపూర్వకంగా ఉన్నారా లేదంటే నిజంగానే మీపై ఇష్టాన్ని కనబరుస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కష్టమే. అసలు అమ్మాయిలు అబ్బాయిలను అట్రాక్ట్ చెయ్యడానికి ఏం చేస్తారు ? ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయం తెలుసుకుంటే అది లవ్వా, ఫ్రెండ్షిప్పా అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అబ్బాయిలని అట్రాక్ట్ చేసేటప్పుడు అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయంలోకి వెళ్తే…

1. రెగ్యులర్ కామెంట్స్
ఎప్పుడైనా అమ్మాయిలు అబ్బాయిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తే కొన్ని రెగ్యులర్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీ హాబీల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నాకు కూడా అదంటే ఇష్టం, నేను కూడా ట్రై చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఇద్దరూ ఒకే విధంగా ఆలోచిస్తున్నారని, అభిరుచులు కలుస్తున్నాయని చెప్పడమే ఆమె ఉద్దేశం.

2. సక్సెస్ గురించి…
ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర ఎక్కువగా తాను సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ ఉందంటే ఆమె అతన్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అర్థం.

- Advertisement -

2. ఎక్కువగా పేరును వాడడం
ఒక అమ్మాయి మాటల్లో ఎక్కువగా అబ్బాయి పేరు విన్పిస్తే, ఆమె అతన్ని అట్రాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నట్టే. ఇదొక సైకలాజికల్ ట్రిక్. ఇలా పేరును ఉపయోగించడం అనేది సాన్నిహిత్యం, అనుబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగించే ఒక టెక్నిక్.

3. డ్రీమ్స్ షేరింగ్
ఒక అమ్మాయి అబ్బాయితో తన డ్రీమ్స్ గురించి మాట్లాడితే, ఆమె తన జీవితంలో అతన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా చూస్తున్నట్టు అర్థం. డ్రీమ్స్ అనేవి పూర్తిగా ఆమె పర్సనల్ విషయం. ఎవరితోనూ షేర్ చేసుకోని అలాంటి విషయాలను ఒక అబ్బాయితో షేర్ చేసుకుంది అంటే కచ్చితంగా ఆమె అతనిపై ఇంట్రెస్ట్ చూపిస్తోందని అర్థం.

4. అప్రిషియేషన్స్
పొగడ్తలు అనేవి అవతల వ్యక్తిని ఆకట్టుకోవడానికి చేసే ట్రిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక అమ్మాయి అబ్బాయిని పొగిడింది అంటే ఆమె అతనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే. అంటే అతనికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ఆమె విలువైనదిగా భావిస్తుందని అర్థం.

5. ఫ్యూచర్ గురించి..
ఒక అమ్మాయి అబ్బాయి పట్ల ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆమె అతని గురించి తరచుగా ఆరా తీస్తుంది. అంటే ఆమె అతని భవిష్యత్తులో భాగం కావాలని ఆలోచిస్తోంది.

6. షేరింగ్…
అమ్మాయి అబ్బాయితో తన భయాలు, ఇన్ సెక్యూరిటీస్ షేర్ చేసుకుంటోంది అంటే అతన్ని బాగా నమ్ముతోంది అని అర్థం. ఆమె నిజాయితీగా అతన్ని అట్రాక్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టు. అలాగే తనకు సంబంధించిన చిన్న చిన్న వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తారు.

7. మీ గురించే ఆలోచన
అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అంటే అతన్ని ఇష్టపడుతున్నట్టే. దీన్ని చూడగానే నువ్వే గుర్తొచ్చావు, నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను అని అమ్మాయి అబ్బాయితో చెప్తే ఆమె ఇంట్రెస్ట్ అంతా అతనిపైనే ఉందని అర్థం.

8. ఆటపట్టించడం
ఆటపట్టించడం అనేది అవతలి వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ను తెలియజేసే ఒక ఉల్లాసపరితమైన మార్గం. కాబట్టి మాటల్లో ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయిని ఆట పట్టిస్తే ఆమె అతన్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు