Personality Development : కొత్త వాళ్ళను కలిసినప్పుడు సిగ్గు పడుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే

చాలామందికి ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు విచిత్రమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కొంతమంది టెన్షన్ పడితే, మరి కొంతమంది సిగ్గు పడతారు. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? అయితే ఇలా కొత్త వాళ్లను కలిసినప్పుడు సిగ్గుతో ముఖం చాటేయకుండా, అవతలి వ్యక్తికి కాన్ఫిడెంట్ గా, స్నేహపూర్వకంగా కనిపించడానికి కొన్ని టిప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. మీ సిగ్గునే కాన్ఫిడెన్స్ గా మార్చగల ఈ కామన్ బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ ను ప్రాక్టీస్ చేసి ఈసారి కొత్త వాళ్లను కొత్తగా కలవడానికి రెడీ అయిపోండి.

1. ఐ కాంటాక్ట్
బాడీ లాంగ్వేజ్ లో ఐ కాంటాక్ట్ అనేది కీలకం. అవతలి వ్యక్తి చెప్పే దానిపై మనకు నమ్మకం, ఇంట్రెస్ట్ ఉంది అని తెలియజేసే ఒక పవర్ ఫుల్ మార్గం ఈ ఐ కాంటాక్టే. కానీ అది అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మాట్లాడేటప్పుడు 50%, వింటున్నప్పుడు 70% ఐ కాంటాక్ట్ ను మెయింటైన్ చేయండి. ఇది మొదటి పరిచయంలోనే మీరు అవతలి వ్యక్తితో ఎంగేజ్ అయ్యారని తెలియజేయడమే కాకుండా మిమ్మల్ని మరింత నమ్మకంగా కనిపించేలా చేస్తుంది.

2. ఓపెన్ బాడీ లాంగ్వేజ్
కాళ్లు చేతులు బిగుసుకుని కనిపించారంటే మీరు టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. దానివల్ల అవతలి వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ను ట్రై చేయండి. కాళ్లు చేతులు రిలాక్స్డ్ గా ఉండేలా చూసుకోండి. అలా ఉంటే మీరు కొత్తవాళ్లతో కంఫర్ట్ గా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుంది.

- Advertisement -

3. చిరునవ్వు
చిరునవ్వు అనేది ఎవరైనా సరే మిమ్మల్ని వెంటనే ఇష్టపడేలా, మీకు మరింత చేరువ అయ్యేలా చేస్తుంది. అయితే ఆ చిరునవ్వు అనేది నిజాయితీగా ఉండేలా చూసుకోండి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహపూర్వక, హృదయపూర్వక చిరునవ్వు అద్భుతాలను సృష్టించగలదు.

4. తలవంచడం తప్పేం కాదు
అవతలి వ్యక్తి చెప్పేది వింటున్నప్పుడు తలవంచడం అనేది తప్పేం కాదు. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మరింతగా ఇష్టపడతారు, త్వరగా దగ్గరైపోతారు. కాబట్టి మాట్లాడుతున్న సమయంలో తల ఊపడం వంటి చిన్న బాడీ లాంగ్వేజ్ వల్ల మీరు ఆ చర్చలో నిమగ్నమై పోయారనే ఫీలింగ్ కలుగుతుంది మాట్లాడే వాళ్లకు.

5. టచ్
గౌరవప్రదమైన స్పర్శ ఇద్దరు వ్యక్తుల మధ్య నిమిషాల్లో మంచి బంధాన్ని క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు షేక్ హ్యాండ్… స్ట్రాంగ్ షేక్ హ్యాండ్ మీలోని కాన్ఫిడెన్స్ ను తెలియజేస్తుంది. ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇస్తే అవతలి వ్యక్తి ఈజీగా దగ్గర అయిపోతారు.

6. మిర్రరింగ్
మిర్రర్ రింగ్ అంటే అవతలి వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ ను కాపీ కొట్టడం. ఇలా చేయడం వల్ల ఇతరులు మీరు కూడా తమలాగే ఉన్నారని భావించి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు.

7. స్ట్రైట్ గా నిలబడండి
నిలబడే విధానాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పొచ్చు. ముఖ్యంగా కొత్తవాళ్లను కలిసినప్పుడు సిగ్గుపడితే స్ట్రైట్ గా నిలబడలేరు. కాబట్టి తల పైకెత్తి, భుజాలను సరిగ్గా పెట్టి స్ట్రైట్ గా నిలబడండి. ఇలా నిలబడటం వల్ల మీరు కాన్ఫిడెన్స్ తో ఉన్నారని, అన్నింటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని అవతలి వ్యక్తికి అర్థమవుతుంది.

8. కంగారు పడకండి
కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఉంగరాన్ని తిప్పడం, మొహాన్ని తాకుతూ ఉండడం, కాలు కలుపుతూ ఉండడం వంటివి చేస్తూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేస్తే కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు కనిపిస్తారు.

9. నెమ్మదిగా మాట్లాడండి
సాధారణంగా భయాందోళనలకు గురైనప్పుడు లేదా సిగ్గు పడినప్పుడు వేగంగా మాట్లాడేస్తారు. అంటే వీలైనంత త్వరగా మాట్లాడేసి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారని అర్థం. కానీ అది అవతలి వ్యక్తికి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి గట్టిగా ఊపిరి పీల్చుకొని, కాస్త నెమ్మదిగా మాట్లాడడానికి ట్రై చేయండి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు