Kiran Abbavaram : సమ్మర్ కి ఒచ్చేస్తాడట..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కసిమీదున్నాడు. లాస్ట్ ఇయర్ వరుస సినిమాలతో ఎంత హడావిడి చేసాడో ఈ ఇయర్ చేస్తున్న సినిమాలు కూడా పెండింగ్ లో పెట్టి కన్ఫ్యూజన్ లో పడ్డాడు. లాస్ట్ ఇయర్ పెద్ద బ్యానర్ లలో వరుస సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు హిట్టుకోసం అల్లాడుతున్నాడు. వరుస పరాజయాలు పలకరించడంతో డీలా పడ్డాడు. అందుకే ఎలాగైనా హిట్టు కొట్టాలని పక్కా ప్లానింగ్ తో ఈ ఏడాది వద్దామని చూస్తున్నాడు. అయితే గత ఐదారు నెలలుగా సైలెంట్ అయిన ఈ హీరో సినిమాలు ఆపేసాడా, లేక ఆఫర్లు లేవా అని ట్రోలింగ్ లు జరిగాయి. కానీ కిరణ్ అబ్బవరం తన ప్లానింగ్ లో తానున్నాడు.

తాజాగా కిరణ్ అబ్బవరం విశ్వ కరణ్ అనే ఒక దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. డెబ్యూ దర్శకుడితో ఆయన చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘దిల్ రూబ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఆడియో కంపెనీ సరెగమా వారు నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ మధ్యనే సైలెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి టీజర్ కూడా రాలేదు కానీ, ఈ సమ్మర్‌కే ‘దిల్ రూబ’‌ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే పెద్ద సినిమాల మధ్య నలిగిపోకుండా, సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పైగా కిరణ్ అబ్బవరం గత సినిమాల ఫలితాల వల్ల ఈ సినిమాతో ఖచ్చితంగా కం బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అటు హీరోయిన్ రుహాణి శర్మ కి కూడా కెరీర్ బిగినింగ్ లో ఒక చిన్న హిట్టు సినిమా తప్ప మళ్ళీ కొన్నేళ్లుగా హిట్ మొహం చూడలేదు. మరి దిల్ రుబా సినిమాతో వీళ్ళిద్దరూ కం బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఇక కిరణ్ అబ్బవరం దిల్ రుబా సినిమా రిలీజ్ అయ్యాకే మరో సినిమా గురించి ఆలోచిస్తాడని సమాచారం.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు