Mrunal Thakur: ఫ్యామిలీ వల్ల చాలా నష్టపోయా… మృణాల్ షాకింగ్ కామెంట్..!

Mrunal Thakur.. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాగవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.. ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు వరుస సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకుంది.. ముఖ్యంగా ఈ సినిమాలో కట్టు బొట్టుతో ప్రిన్సెస్ నూర్ జహాన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నటించిన ప్రతి చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. నాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో కూడా నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఎక్కువ సినిమాలలో అవకాశాలు కోల్పోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.

Mrunal Thakur: Family lost a lot...Mrunal's shocking comment..!
Mrunal Thakur: Family lost a lot…Mrunal’s shocking comment..!

ఫ్యామిలీ వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయా..

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. నేను ఇంటిమేట్ సీన్స్ లో నటించడం మా తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు.. అందువల్ల కొన్ని పెద్ద సినిమాలను కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది .. ఆ తర్వాత కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయడం అత్యవసరమని.. మా అమ్మ నాన్నకు అర్థమయ్యేలా చెప్పి సినిమాలు చేస్తున్నాను.. అయితే గతంలో ముద్దు సన్నివేశాలు, శృంగార భరిత సన్నివేశాలలో నటించే అవకాశాలు వచ్చినప్పుడు.. నా తల్లిదండ్రుల వల్ల నేను వాటిని కోల్పోయాను.. అంతేకాదు మొదట్లో వాటి కారణంగా నేను కూడా భయపడేదాన్ని.. పరిస్థితులను అర్థం చేసుకొని ఈ చిన్న సీన్ కోసం ఒక సినిమానే వదులుకోవాల్సిన పరిస్థితి ఏంటి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పి ఇప్పుడు అవకాశాలు అందుకుంటున్నాను అంటూ మృణాల్ కామెంట్లు చేసింది.. మొత్తానికైతే పెద్ద పెద్ద సినిమాలలో ఇలాంటి సన్నివేశాల వల్ల అవకాశాలు కోల్పోయానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ..

మృణాల్ బాలీవుడ్ కెరియర్…

మృణాల్ బాలీవుడ్ కెరియర్ విషయానికి వస్తే.. కుంకుమ భాగ్య, ముజ్సే కుచ్ కెహ్తీ ఖామోషియాన్ వంటి సీరియల్స్ ద్వారా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత సినిమాలలో అవకాశాన్ని దక్కించుకుంది. సీరియల్స్ లో నటించినందుకుగాను ఉత్తమ నటిగా భారతీయ టెలివిజన్ అవార్డును దక్కించుకున్న ఈమె.. 2018లో వచ్చిన ఠాకూర్ లవ్ సోనియా అనే సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.. ఇక 2019లో బయోపిక్ లు అయిన సూపర్ 30 మరియు బాట్ల హౌస్ తో పేరు సంపాదించుకున్న ఈమె తెలుగులో సీతారామం సినిమాతో మంచి పాపులారిటీ అయింది.. అంతేకాదు ఈ సినిమాతో రెండు సైమా అవార్డులను కూడా గెలుచుకుంది.. తర్వాత హాయ్ నాన్న సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మృణాల్.. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం బెడిసికొట్టిందని చెప్పాలి.. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న పూజా మేరీ జాన్ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మొత్తానికి అయితే తన తల్లిదండ్రులను ఒప్పించి ఇప్పుడు ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు