Jr NTR Upcoming Movie : బ్రహ్మాస్త్ర 2లో తారక్… రెమ్యునరేషన్‌ కూడా ఫిక్స్

Jr NTR Upcoming Movie : కొన్ని రోజుల క్రితం వరకు బాలీవుడ్ పై తెలుగు హీరోలకు మోజు తక్కువ ఉండేది. కానీ, ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో సినిమాలు చేయాలని, అక్కడి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పని చేయాలని ఎక్కువ అనుకుంటున్నారు. ఇదే టైంలో బాలీవుడ్ సినిమాలేవీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. షారుక్ ఖాన్ మినహా హీరోలు అందరినీ బీ టౌన్ ఆడియన్స్ ఛీ కోడుతున్నారు. ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాలు వచ్చినా డిజాస్టర్లు అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్‌కు బ్యాక్ టూ బ్యాక్ 10 డిజాస్టర్లు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జూనియర్ ఎంట్రీ…

ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ స్టార్స్ పై బాలీవుడ్ మేకర్స్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వస్తున్న వార్ 2 మూవీలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఒక షెడ్యూల్ పూర్తి కాగా, మరో షెడ్యూల్ కోసం తారక్ మళ్లీ ముంబై వెళ్లాడు. అంతా సక్రమంగా సాగుతున్న టైంలో ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన రూమర్ అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం.. నిన్న సాయంత్రం కొంత మంది బాలీవుడ్ స్టార్స్, ఎన్టీఆర్ డిన్నర్ కి వెళ్లడమే.

డిన్నర్ పార్టీతోనే ఈ గాసిప్స్…

ఈ డిన్నర్ పార్టీలో ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహర్ ఉన్నాడు. అలాగే డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ, రణబీర్ కపూర్, ఆలియా భట్ కూడా ఉన్నారు. ఇక్కడా ఈ వార్తలు రావడానికి కారణమైంది. వీళ్ల కాంబినేషన్‌లో ఈ మధ్య కాలంలో బ్రహ్మస్త్ర పార్ట్ 1 : శివ అనే సినిమా వచ్చింది. రణబీర్ ఆలియా హీరో హీరోయిన్లుగా నటించగా, ఆయాన్ ముఖర్జి డైరెక్టర్. కరణ్ జోహర్ నిర్మాత.

- Advertisement -

దేవ్‌గా తారక్…

ఈ సినిమాకు దీనికి సీక్వెల్ గా బ్రహ్మస్త్ర పార్ట్ 2 : దేవ్ అని వస్తుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ, ఇప్పటి వరకు డైరెక్టర్ ఆయన్ నుంచి కానీ, నిర్మాత కరణ్ నుంచి కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ, ఇప్పుడు వీరు కలవడంతో బ్రహ్మస్త్ర పార్ట్ 2 దేవ్ పై అనేక అనుమానాలు వస్తున్నాయి. దీనిలో దేవ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ను ఫిక్స్ చేశారని, అందుకే ఈ డిన్నర్ పార్టీలు అంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఇప్పటికే రెమ్యురేషన్ కూడా ఫిక్స్ చేశారని అని కూడా ఓ టాక్ ఉంది. మరి ఇది నిజమో కాదో.. తెలియాలంటే కరణ్ జోహర్ స్పందించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు