Sanjay dutt : ధృవ సర్జా కొడుకు నామకరణ వేడుకలో సంజయ్ దత్ ఏం చేస్తున్నాడు?

Sanjay dutt : కన్నడ స్టార్ ధృవ సర్జా తాజాగా తన రెండవ బిడ్డ నామకరణ వేడుకను ఘనంగా నిర్వహించారు. బెంగళూరులో ఈ వేడుకను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించగా, ధృవ సర్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్పించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఈ బీ టౌన్ స్టార్ కన్నడ నటుడైన ధృవ సర్జా ఫ్యామిలీ ఈవెంట్ లో ఏం చేస్తున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే…

ధృవ సర్జా కొడుకు పేరు ఇదే

కన్నడ సెలెబ్రిటీ కపుల్ ధృవ సర్జా, ఆయన భార్య ప్రేరణ తమ కుమారుడి నామకరణ వేడుకలో సంప్రదాయ దుస్తువులు ధరించి కన్పించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, ముఖ్య అతిథులు హాజరయ్యారు. ధృవ సర్జా తన కుమారుడికి “హయగ్రీవ డి సర్జా” మరియు అతని కుమార్తెకు “రుద్రాక్షి డి సర్జా” అని పేరు పెట్టారు. హిందూ మతంలో రెండు పేర్లకు మంచి ప్రాముఖ్యత ఉంది.

అతిథిగా సంజయ్ దత్…

ఇక ఇదే వేడుకకు ధృవ పిలుపు మేరకు సంజయ్ దత్ అతిథిగా హాజరయ్యారు. ఆయనను చూడగానే సంతోషంలో మునిగిపోయిన కన్నడ స్టార్ కుటుంబ సభ్యులు ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. ఇక సంజయ్ ధృవ సర్జా కొడుకుని ఆశీర్వదించారు. మరి ఈ వేడుకకు అసలు ఆయన ఎందుకు హాజరయ్యాడు అంటే ధృవ నెక్స్ట్ మూవీ సంజయ్ దత్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను తమ కుటుంబ వేడుకకు కూడా ఆహ్వానించారు. ఇక ఆయనతో దిగిన ఫోటోలను ధృవ సర్జా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధృవ కుటుంబంతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనతో పాటు సీనియర్ హీరో అర్జున్ కూడా ఫోటోలను పోజులు ఇచ్చారు.

- Advertisement -

ధృవ సినిమాల విషయానికొస్తే…

ధృవ సర్జా ఖాతాలో ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ లు ఉన్నాయి. అర్జున్ దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియన్ యాక్షన్ చిత్రం మార్టిన్‌లో హీరోగా నటిస్తున్నాడు. అన్వేషి జైన్, వైభవి శాండిల్య ఇతరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వాసవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఉదయ్ కె మెహతా నిర్మించారు.

మార్టిన్‌తో పాటు ధృవ సర్జా మరో పాన్-ఇండియన్ చిత్రం కేడీ : ది డెవిల్‌లో కూడా నటించనున్నారు. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య, సంజయ్ దత్, నోరా ఫతేహి, శిల్పా శెట్టి వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 1970వ దశకం ప్రారంభంలో సాగే ఈ మూవీకి అర్జున్ జన్య సంగీతం అందించనున్నారు. కాగా ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండడం విశేషం. మరి మార్టిన్, కేడీ సినిమాలతో పాన్ ఇండియా రేసులోకి దిగుతున్న ధృవ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు