Bheems Ceciroleo : దేవి, థమన్ కి గండి కొడుతున్నాడుగా!

Bheems Ceciroleo : భీమ్స్ సిసిరోలియో.. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినబడుతున్న పేరు. టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా సరైన బ్రేక్ రావడానికి చాలా టైం పట్టిందని చెప్పొచ్చు. మొన్న మొన్నటి దాకా, డిఎస్పీ డప్పుకి ,థమన్ డ్రమ్ము సౌండు విని కాస్త బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులకి, తనదైన మాస్ ట్యూన్స్ తో మెలోడీలతో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు భీమ్స్. నిజానికి భీమ్స్ పాటలంటే ఇప్పుడే కాదు, తన తొలి సినిమాలో ‘బ్లాక్ బెర్రీ’ అంటూ తోనే సెన్సేషన్ సృష్టించాడు. నువ్వా నేనా అనే చిత్రంలో ఈ పాటను రాసి మ్యూజిక్ అందించాడు. అయితే భీమ్స్ కి సరైన గుర్తింపు వచ్చింది రవితేజ బెంగాల్ టైగర్ సినిమాతో. కానీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు మాత్రం రాలేదు. చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఇప్పటిదాకా నెట్టుకొచ్చాడు. కానీ ఏడాదిన్నర గా భీమ్స్ టాలీవుడ్ లో ఓ రేంజ్ లో బిజీ అయ్యాడు. రవితేజ ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ కి వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ బలగం, మ్యాడ్ వంటి చిన్న సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన మ్యూజిక్ టేస్ట్ ఎలాంటిదో చూపించాడు. ఇక ఇప్పుడు వరుస ఛాన్సులతో ఈ ఇయర్ టాలీవుడ్ లో అందరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకంటే ఎక్కువ బిజీ అవుతున్నాడు భీమ్స్.

దేవి, తమన్ కు ఆల్టర్నేటివ్ దొరికేసాడు!

అయితే టాలీవుడ్ లో కొన్నేల్లుగా తెలుగు కమర్షియల్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్, థమన్ కాకుండా ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ తెలుగు వాళ్ళను కాకుండా అరవ ఇండస్ట్రీ నుండి అనిరుధ్, జివి ప్రకాష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లను, తాజాగా మలయాళం నుండి హేశం అబ్దుల్లా, కన్నడ నుండి రవి బాసూర్ లాంటి వాళ్ళని భర్తీ చేస్తున్నారు. కానీ రీసెంట్ గా భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo ) మ్యూజిక్ కి మంచి డిమాండ్ ఏర్పడడంతో వీళ్ళకి గండి కొడుతున్నాడు భీమ్స్. వరుసగా స్టార్ హీరోల సినిమాలకు భీమ్స్ బుక్ అయిపోతున్నాడు. ఇప్పుడు పలు స్టార్ హీరోల సినిమాలకు డిఎస్పీ, అలాగే థమన్ కాకుండా వేరే ఆప్షన్ గా భీమ్స్ ఇప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేసాడు. తాజాగా అరడజను కొత్త సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించబోతున్నారు. అందులో రవితేజ, వెంకటేష్ సినిమాలు కూడా ఉన్నాయి.

చేతిలో స్టార్స్ సినిమాలు..

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం భీమ్స్ దాదాపు పది సినిమాలకు పైగా మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. అందులో ప్రస్తుతం అరడజను సినిమాలు ఆల్రెడీ షూటింగ్ చేయుకుంటున్నాయి. ఇక ఈ ఇయర్ టిల్లు స్క్వేర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో భీమ్స్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇక రానున్న కొత్త సినిమాల్లో తాజాగా రవితేజ సితార బ్యానర్ సినిమా, వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇవే గాక బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు, సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ లతో పాటు మరో అరడజను సినిమాలతో భీమ్స్ సిసిరోలియో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు