Chammak Chandra: చమ్మక్ చంద్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటి..!

Chammak Chandra.. జబర్దస్త్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని ఆ ఇమేజ్ తో సినిమాలలో కూడా అవకాశం అందుకుని.. భారీ క్రేజ్ దక్కించుకున్న చమ్మక్ చంద్ర.. పలు రకాల బుల్లితెర షోలలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా చమ్మక్ చంద్ర పై ఒక లేడీ కమెడియన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.. ప్రముఖ టాలీవుడ్ నటి వైజాగ్ జగదీశ్వరి.. కమెడియన్ చమ్మక్ చంద్ర పై షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది..

Chammak Chandra:Famous actress made comments on Chammak Chandra..!
Chammak Chandra:Famous actress made comments on Chammak Chandra..!

చమ్మక్ చంద్ర పై వైజాగ్ జగదీశ్వరి కామెంట్స్..

వైజాగ్ జగదీశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు సహాయం చేసిన వారి గురించి వెల్లడించింది.. చమ్మక్ చంద్ర తో నేను రెండు ఎపిసోడ్లలో ఒక కామెడీ షో లో కలిసి పని చేశాను.. నన్ను మమ్మీ అని చంద్ర పిలుస్తారు.. నా ఇంటర్వ్యూ చూసి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకొని నాకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.. నేను అడగకుండానే నాకు డబ్బులు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్న చమ్మక్ చంద్ర మనసు చాలా గొప్పది.. బయటకు చాలా రఫ్ గా కనిపిస్తారు కానీ చాలా మంచి మనసున్న వ్యక్తి అంటూ చమ్మక్ చంద్ర పై పాజిటివ్ కామెంట్లు చేసింది వైజాగ్ జగదీశ్వరి..

గోపీచంద్ భీమా..

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన భీమా సినిమాలో ఛాన్స్ ఇచ్చి షూట్ కి రమ్మన్నారు.. డైలాగు స్పీడుగా చెప్పమని డైరెక్టర్ కోరారు ..ఆ తర్వాత నన్ను తీసేశారు అని తెలిసింది.. అయితే వారు చెప్పినట్టే చేశాను.. కానీ ఎందుకు తీసేసారో తెలియదు. ఇక నన్ను రిజెక్ట్ చేశారని తెలిసి చాలా ఏడ్చేశాను.. నా పాత్రకు బదులుగా షెర్లి అనే మరో నటి నటించింది అంటూ చెప్పుకొచ్చింది జగదీశ్వరి.

- Advertisement -

హైపర్ ఆది పై కామెంట్స్..

శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది నాకు అవకాశం ఇప్పించారు.. అప్పుడు నాకు రూ.10 వేల రెమ్యునరేషన్ వచ్చింది.. ఇప్పుడు మల్లెమాల సంస్థ అందరికీ జీతాలు ఇస్తోంది.. ఒక్క ఎపిసోడ్కి మాత్రం నాకు 15వేల రూపాయల పారితోషకం ఇచ్చారు అంటూ జగదీశ్వరి చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తనను ఎవరు పిలవడం లేదని ..ముఖ్యంగా జబర్దస్త్ కి అసలు పిలవడం లేదని.. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి మాత్రం అప్పుడప్పుడు పిలుస్తున్నారంటూ చెప్పుకొచ్చింది.. ఇక హైపర్ ఆది మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారని జగదీశ్వరి కామెంట్లు చేయడం గమనార్హం.

వైజాగ్ జగదీశ్వరి కెరియర్..

ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ గా పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన వైజాగ్ జగదీశ్వరి… ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడుతోంది.. అయితే చిన్న చిన్న కమెడియన్ లు మాత్రం పలు కామెడీ షో లలో అవకాశాలు ఇప్పిస్తున్నారు.. కానీ ఆర్థికంగా అండగా నిలవలేక పోతున్నారు.. దీనితో తనకు మళ్ళీ సినిమాలలో అవకాశాలు కావాలని కోరుకుంటుంది వైజాగ్ జగదీశ్వరి.. మరి ఈమె ఆర్థిక కష్టాలను విని ఎవరైనా దర్శకులు అవకాశం ఇస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు