Bollywood : బాలీవుడ్ చరిత్రలో అరుదు.. ఒకేసారి 400 కోట్లు నష్టం..

Bollywood : బాలీవుడ్ లో ఈ ఇయర్ రంజాన్ కి రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిసిందే. అందులో ఒకటి ఎప్పటి నుండో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన మూవీ అయితే, మరొకటి రీసెంట్ టైంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. అందులో ఒకటి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన మల్టీ స్టారర్ ‘బడే మియా చోటే మియా’ (Bade Miyan Chote Miyan ) మరియు, అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ (Maidaan Movie) సినిమా. ఈ రెండు చిత్రాలు రంజాన్ కానుకగా రిలీజ్ అయ్యాయి. బడే మియా చోటే మియా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ఆర్మీ ఏజెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఆక్షన్ ఎంటర్టైనర్ కాగా, మైదాన్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఫుట్ బాల్ కోచ్ బయోపిక్ డ్రామా. ఈ రెండిటికి ఆయా జోనర్ లలో మంచి క్రేజీ బజ్ లు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలు రంజాన్ కి విడుదలై ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాయి.

ఒకటి పాజిటివ్, మరొకటి నెగిటివ్ రెండిటికి లాసే..

అయితే రంజాన్ రోజున విడుదలైన మైదాన్ మూవీ కి క్రిటిక్స్ పరంగా మంచి పాజిటివ్ రివ్యూలు సొంతం అవగా, బడే మియా చోటే మియా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా, రెండిటికి ఆడియన్స్ ఒకే విధంగా దెబ్బేసారని చెప్పొచ్చు. బడే మియా చోటే మియా కమర్షియల్ సినిమా కాబట్టి ముందుగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, రెండో రోజు నుండే ఢమాల్ అంది. ఇక మైదాన్ కి మంచి రివ్యూలు వచ్చినా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని నిరాశ పరచగా, కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు. రెండు సినిమాల వసూళ్లు కలిపినా కనీసం రెండు వందల కోట్ల వసూళ్లు కూడా ఇప్పటివరకు రాలేదు.

ఒకేసారి 400 కోట్లు నష్టం..

అయితే తాజాగా ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వారం పూర్తి కాకుండానే ప్రేక్షకులు లేక థియేటర్లలోంచి తీసేస్తున్నారు బయ్యర్లు. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఆల్ మోస్ట్ మేకర్స్ కి ఓవరాల్ గా 350 కోట్ల నుండి 400 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం అయ్యేలా చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బడే మియా చోటే మియా ఎంతో కొంత నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రికవరీ అయినా కూడా, బడ్జెట్ కూడా 350 కోట్ల రేంజ్ లో ఉండటంతో భారీ నష్టాలు ఖాయమని అంటున్నారు. ఇక మైదాన్ మూవీ ఎప్పటి నుండో డిలే అవుతూ రావడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అనుకున్న రేంజ్ లో దక్కలేదు. ఇటు థియేటర్స్ లో పాజిటివ్ టాక్ ఉన్నా కూడా వసూళ్లు రావడం లేదు. దాంతో ఈ సినిమాకి కూడా లాస్ లు చాలా రావడం ఖాయమని అంటున్నారు. రెండు సినిమాలు కలిపి 400 కోట్లకు పైగా లాస్, అది కూడా ఒకే టైంలో రిలీజ్ అయ్యి లాస్ అవ్వడం బహుశా
బాలీవుడ్(Bollywood) చరిత్రలో చాలా రేర్ గా జరిగే విషయం అని చెప్పాలి. మరి ఈ సినిమాల నిర్మాతలు ఎలా తేరుకుంటారో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు