Mamitha baiju: స్టార్ హీరోయిన్ పాటకు అదిరిపోయే స్టెప్పు లేసిన ప్రేమలు బ్యూటీ..

Mamitha baiju.. కొంతమంది హీరోయిన్స్ కేవలం ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు ఉన్నారు.. మరికొంతమంది ఆ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో కేరళ కుట్టి మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ . ప్రేమలు సినిమాలో రీను పాత్రలో అద్భుతంగా నటించింది మమితా.. ప్రేమలు సినిమాలో ఈమె యాక్టింగ్, ఆటిట్యూడ్ , స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఈమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి థియేటర్లలో ఆడియన్స్ కాస్త అభిమానులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే మమిత బైజుకి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే బయటకు వచ్చిందంటే అది ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది.. ఈ ప్రేమలు సినిమా ఈమెకు ఎంతలా గుర్తింపు తీసుకొచ్చిందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.

Mamitha baiju: Premalu Beauty, who has stepped up to the star heroine's song..
Mamitha baiju: Premalu Beauty, who has stepped up to the star heroine’s song..

ఐశ్వర్యారాయ్ పాటకు మమితా స్టెప్పులు..

ప్రేమలు సినిమా వల్ల సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ రేంజ్ పెరిగిపోయింది. తెలుగులో అవకాశాలను కూడా అందుకుంటున్నట్లు తెలుస్తోంది.. తాజాగా మమితకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ వీడియోలో మమితా ఏదో వివాహ వేడుకలలో డాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఈమె ఎనర్జీ కి కుర్రకారులు , అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా పేరు సంపాదించిన గురు చిత్రంలోని ఐశ్వర్య రాయ్ వేసిన నాన్నారే.. నన్నారే అనే పాటకు మమితా స్టెప్పులు వేయడంతో అందరూ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మమితా పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా..

మమితా తన డాన్స్ తో ఐశ్వర్యరాయ్ నే మరిపించేంతగా డాన్స్ వేసిందని అభిమానులు సైతం ఈ వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది టాలీవుడ్ లో మరో సాయి పల్లవి అంటూ మమితా వీడియో పైన కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

తెలుగులో అవకాశాలు..

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వచ్చినట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు.. నిజానికి ఇందులో మొదట హీరోయిన్గా శ్రీ లీలను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని కారణాల చేత ఈమెను తప్పించి ఆమె స్థానంలో మమితా ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ముద్దుగుమ్మకు మలయాళం లో కూడా ఎన్నో సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మరి టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు అదృష్టం ఎలా ఉందో చూడాలి మరి. మొత్తానికైతే ప్రేమలు సినిమా మమితా బైజుకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు